ఒకావిడకి ఒక పెద్ద సిటీలో ఇంటర్వ్యూ అవ్వగానే ఉద్యోగం వచ్చింది. ఆవిడ ఈ విషయాన్ని ఎలాగైనా తన భర్తకి చెప్పాలని, మొబైల్ కి మెసేజ్ చేసింది.
కానీ,ఆవిడ..నంబరు సరిగ్గా చూసుకోకుండా, వేరే నంబరు కి మెసేజ్ చేసింది.
ఎవరికైతే ఆ మెసేజ్ వెళ్ళిందో.. అతను పాపం అప్పుడే తన భార్య అంతిమ సంస్కారాలు పూర్తి చేసి వస్తున్నాడు. ఆ మెసేజ్ చూసుకుని అతని కళ్ళు గిర గిరా తిరిగాయి..
ఆ మెసేజ్ ఏంటంటే..
"ఏవండి.. నేను జాగ్రత్తగానే చేరుకున్నాను. ఇక్కడ ఉండటానికి అన్ని సదుపాయాలూ ఉన్నాయి. ఉల్లి ధర కూడా తక్కువేనండోయ్. మొబైల్ నెట్‌వర్క్ కూడ బాగుంది. మీరేం బాధ పడొద్దు, రెండు మూడ్రోజులు పోయాక మీరూ ఇక్కడికే వచ్చేద్దురూ.