Search This Blog

Chodavaramnet Followers

Saturday 4 July 2015

BEAUTIFUL NATURE - TELUGU KIDS MORAL STORIES COLLECTION


ఒక మంచి కధ

ఒక రోజు ఒక అంధుడు ఒక బంగాళా మెట్ల దగ్గర తన టోపీ తో మోకాళ్ళ మిద కూర్చున్నాడు.మరియు ఒక బోర్డు మీద
నేను అంధుడిని, నాకు సహాయం చేయగలరు"
అని రాసిపెట్టుకున్నాడు. 

అది చూసిన జనాలు కొంతమంది మంది మాత్రమే డబ్బుల్ని టోపిలో వేస్తునారు. కాసేపటికి ఒక వృధుడు అటుగా వెళ్తూ ఆ బోర్డ్ ని చూసి తన జేబులో నుండి కొంత డబ్బుని తీసి ఆ టోపిలో వేసాడు.తర్వాత తన దగ్గర ఉన్న కలాన్ని తీసి ఆ బోర్డ్ మిద ఎదో రాసి వెళ్ళాడు. అప్పటినుండి ఆ టోపిలో చాల డబ్బులు వచ్చి పడ్డాయి.

ఆ టోపీ మొత్తం డబ్బు తో నిండిపోయింది.
కాసేపటికి ఆ వృధుడు మరల అక్కడికి వచ్చాడు. తన అడుగుల శబ్దాన్ని గమనించిన ఆ అంధుడు ఆ వృధుడుతో మీరు ఇందాక నా బోర్డ్ మీద ఎదో రాసినట్టు ఉన్నారు, అప్పటినుండి డబ్బులు ఎక్కువ
వచాయి ఇంతకీ ఎం రాసారు అని అడిగాడు.

అప్పుడు ఆ వ్రుధుడు ఇలా సమాధానం ఇచాడు .
ఈ రోజు చాలా అందమైనది కానీ నేను చూడలేను....
ఒకసారి ఆలోచించండి బోర్డు మీద రాసిన మొదటి పదం, ఇప్పుడు వృధుడు రాసిన పదం రెండు చూడటానికి ఒకలాగే ఉన్నాయి కదా...
అవును ఇద్దరు రాసిన పదాలు ఆ వ్యక్తీ అంధుడు అని చెపుతున్నాయి.

కానీ మొదట పదం సులభ పద్దతిలో తను అంధుడిని అని చెపుతుంది.
కానీ రెండవ పదం, మనం చాలా అడురుష్టవంతులం .
అందులం కాదు. అందమైన ప్రపంచాని చూస్తున్నాము...
..
మనం అందులం కాదు అందుకే ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం.
కానీ మనలాంటి కొందరు అందులుగా ఉన్నారు...

వారు మనలాగా ఈ అందమైన ప్రపంచాన్ని చూడలేరు.. కాబట్టి, అంధులు కనపడితే మీకు తోచిన సహాయం చేయండి...