Search This Blog

Chodavaramnet Followers

Friday 13 March 2015

INFORMATION ABOUT SOWBHAGYA GOWRI VRATHAM IN TELUGU


సౌభాగ్య గౌరీ వ్రతం

ఈ వ్రతమునకు పాఠించవలసిన నియమాలు:

1) ఏ వయసు స్త్రీలైనను ఈ వ్రతమును ఆచరించవచ్చును.
2) ముఖ్యముగా గృహిణులు ఆచరించు వ్రతమిది.
3) మార్గశిర మాసములో శుక్ల పక్ష తదియనాడు ప్రారంభించాలి.
4) తరువాత 12 నెలలూ శుక్ల పక్ష తదియనాడు ఈ వ్రతమునాచరించాలి.
5) తర్వాత 12 నెల పూర్తైన పిదప 13 వ నెల తదియనాడు ఉద్యాపనము చేయాలి.
6) శుక్ల పక్ష తదియనాడు ఆమహిళ బయటుండుట, మైల మొదలైన అవాంతరములు వస్తే కృష్ణపక్షతదియనాడు ఉద్యాపనము చేయాలి.
7) ఆ వ్రతము దినములలో పగలు నిద్రపోరాదు. ఉదయమునుండి ఉపవాసము చేసి, రాత్రి ఫలహారము చేయాలి.
8) ఆదినమున మత్స్య మాంసాలు ముట్టరాదు.
9) వ్ర్తము ముందు రోజు, వ్రతమునాడున బ్రహ్మచర్యము పాట్ంచాలి.
10) ఉద్యాపన(13 వ నెలలో) మన శక్తిననుసరించి శివునకు వెండిబిళ్ళ, ఉమకు బంగారము బిళ్ళ పెట్టి పూజించాలి. శివునకు తెల్లని పంచలచాపు, పార్వతికి ఎర్రని చీర, రవికెల గుడ్డ పెట్టి పూజించి తర్వత బ్రాహ్మణ దంపతులను ఆహ్వానించి వారికి దానమియ్యాలి.
11) ప్రతి నెలా పూజానంతరము ఒక సౌభాగ్యవతికైననూ పసుపు, కుంకుమ, ఎర్రని జాకెట్టు బట్టనిచ్చి నమస్కరించాలి. ఒక పుస్తకానివ్వండి.
12) ఉద్యాపన దినమున శక్తిగలవారు 12 మంది స్త్రీలకు పసుపు, కుంకుమ, ఎర్రని జాకెట్టు బట్టనిచ్చి నమస్కరించాలి. శక్తి లేనివారు కనీసం జాకెట్టు బట్ట నైననూ ఈయండి.

* సౌభాగ్య గౌరి వ్రతము వలన కలిగే ఫలితాలు:

1. భోగభాగ్యములు లభించుట.
2. భర్తస్థితి అభివృద్ది అగును.
3. భర్తతో కలహములు, ఎడబాటు తగ్గు భర్త అనురాగమును పొందగలరు.
4. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది.
5. ప్రతి ఇల్లు అష్టైశ్వర్యములతో తులతూగుతాయి.
6. పెళ్లికాని కన్యలు చేస్తే వివాహము అవుతుంది.
7. పార్వతి పరమేశ్వరుల వలే ఆదర్శ దాంపత్యము లభించును.
8. వైధవ్యము పొందినవారు మరుజన్మలో సౌభాగ్యవతులయ్యెదరు.
9. ఈ వ్రతము ఆచరించినవారికి మోక్షము కలుగును.