Search This Blog

Chodavaramnet Followers

Sunday 30 November 2014

HEALTH TIPS WITH ONIONS


ఉల్లిగడ్డ లేదా ఉల్లిపాయ - ఆరోగ్య రహస్యాలు 


1) తక్కువ క్యాలరీలు , తక్కువ ఫ్యాట్ కలిగి ఎక్కువ ఫైబర్ (పీచు) కలిగి ఉంటుంది.
2) ఉల్లి లో ఉండే "ఎలిసిన్" (పైటో కెమికల్ కంపౌండ్స్ allium & allyl disulphide ) కాన్సర్ రాకుండా కాపాడుతుంది.
3) ఉల్లిపాయలో anti -diabetic గుణాలు ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
4) బరువు నియంత్రణ లో కూడా తోడ్పడుతుంది.అధికంగా ఉన్న కొవ్వును నియంత్రిస్తుంది.
5) ఉల్లిపాయలో యాంటి - బాక్టీరియల్ , యాంటి - వైరల్ , యాంటి - ఫంగల్ గుణాలు ఉన్నాయి.
6) దీనిలో ఉండే అలిసిన్ అధిక రక్త పోటును నియంత్రించి , గుండెకు రక్తప్రసరణ సులభతరం చేస్తుంది.అంతే కాకుండా స్ట్రోక్ రాకుండా చేస్తుంది.
7) ఉల్లిపాయలో క్రోమియం అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో ఇన్సులిన్ తగిన మోతాదులో ఉండేలా చేసి , షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.
8) ఇంకా ఉల్లిపాయలో యాంటి - ఆక్సిడెంట్లు , విటమిన్ - c , మాంగనీస్ , B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి.
9) కాబట్టి ఉల్లి చేసే మేలు - తల్లి కూడా చేయదు అనే సామెత నిజమే. ఉల్లి లేనిదే ఏ కూర మాత్రం ఉంటుంది.
10) కాబట్టి అధికబరువు , అధికరక్తపోటు , షుగర్ ఉన్నవారు ఒక ఉల్లిపాయను చక్రాలుల కోసి , కొంచెం నిమ్మరసం పిండి , ఆహరం తో పాటు తీసుకొంటే ఎంతో మేలు కలుగుతుంది.