Search This Blog

Chodavaramnet Followers

Sunday 30 November 2014

ARTICLE ON GODDESS KAMAKSHI TEMPLE - KANCHI - KANCHIPURAM - TAMILNADU - INDIA


నగరేషు కాంచి

"పుష్పేషు జాజి పురుషేషు విష్ణు నదీషు గంగ నగరేషు కంచి" అని మహా కవి కాళిదాసు సంస్కృతంలో విరచించారు.

01. పుష్పాలలో జాజి, పురుషులలో విష్ణు, నదులలో గంగ, నగరాలలో కంచి అత్యుత్తమమైనవి.

02. "కాశి, కాంచి, మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి" లు సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

03. కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

04. కాంచీపురం "ద గోల్డెన్ సిటి ఆఫ్ 1000 టెంపుల్స్".

05. కాంచీపురం లో భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు చే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది.

06. కాంచీపురం లో శ్రీ కామాక్షి దేవి కొలువుదీరి ఉంది. శ్రీ కామాక్షి దేవి ని "కామాక్షి తాయి" అని , "కామాక్షి అమ్మణ్ణ్ " అని కూడా పిలుస్తారు.

07. పూర్వం ఇక్కడ ఉండే బంగారు కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరు లో కొలువుదీరి ఉన్నారు. శ్రీ కామాక్షి దేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.

08. పంచభూత స్థలాలలో ఒకటైన, ఏకాంబరేశ్వరుడు "పృథ్వి లింగం" గా కొలువుదీరిన క్షేత్రమే కాంచీపురం.

09. "చూస్తే భోగ్యమైన కంచి వరదుని గరుడసేవ చూడాలి" అనే విధంగా కంచి శ్రీవరదరాజ స్వామి గరుడసేవ జరుగుతుంది.

10. పరమశివుడు 16 పట్టల లింగంగా కొలువుదీరిన కైలాసనాథార్ ఆలయం కాంచీపురం లోనే ఉంది.

11. పార్వతిపరమేశ్వరుల గారాలపట్టియైన సుబ్రమణ్యస్వామి కొలువైన కుమారకొట్టం, కామాక్షి దేవి, ఏకాంబరేశ్వరుడు దేవాలయాల మధ్యలో ఉంటుంది.

12. శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్య దేశాలలొ, 14 దివ్య దేశాలు కాంచీపురంలో కొలువుదీరి ఉన్నాయి.

13. శైవులకు, శాక్తేయులకు, వైష్ణవులకు పరమపవిత్రమైన క్షేత్రం కాంచీపురం.

14. కాంచీపురానికి ఉన్న మరో పేరు కాంజీవరం. కాంజీవరం పట్టుచీరలు చాలా ప్రసిద్ధి. కాంచీపురం శిల్పకళకు కాణాచి.

ఇంతటి విశిష్టత కలిగింది కనుకే నగరేషు కంచి