Search This Blog

Chodavaramnet Followers

Tuesday 21 October 2014

Article about Trinadha vratakalpamu in English and Telugu - Lord Vishnu - Lord Maheswara and Lord Brahma Puja Story


త్రినాథ వ్రతకల్పము

త్రినాథ వ్రతంలో హిందువులు పూజించే త్రిమూర్తులు. - త్రినాథ వ్రతకల్పము
త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.

వ్రత సామగ్రి
తులసీ సహిత విష్ణువు యొక్క బొమ్మ లేదా చిత్ర పటము,
మామిడి ఆకులు
అరటిమొక్కలు
కొబ్బరికాయలు
పండ్లు
పువ్వులు
పసుపు
కుంకుమ
గంధం
హారతి కర్పూరం
అక్షింతలు
అగ్గిపెట్టె
అగరు వత్తులు
వస్త్రం
యజ్ఞోపవితములు,
తోరములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసీ సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు)
ప్రత్యేక నివేదన (పిండి వంటలు)
సంక్షిప్తంగా వ్రత శ్లోకం
సీ|| చిన నాటినుండియు - సిరియన నెరుగని
బీద బాపడొకడు - పెరుగుచుండె
గృహిణి ప్రార్ధన చేత - కూర్మితో గొనియెను
కురుచయై చెలగెడు - గోవునొండు
యా గోవు గానక - యజమాని యొకనాడు
దాని వెదుకబోయి - తాను గాంచె
బ్రహ్మ విష్ణు మహేశ్వ - రాభిధేయు లయిన
దేవతల నొక ప్ర - దేశమందు
గీ|| వారి నధిక భక్తి గొలిచి - వరలనపుడు
అష్ట భోగముల నంది త - నవని వీడె
పూర చరితులౌ దలచు - భూమి జనులు
వారి పూజించి భక్తిరో - బరగవలయు
ప్రార్ధన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః
ఓం నారాయణాయ స్వాహాః
ఓం మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ త్రినాథష్టోత్తర శతనామావళి
ఓం భూతాత్మనే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం పరమాత్మాయ నమః
ఓం బలాయ నమః
ఓం భూతకృతే నమః
ఓం శర్వాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం అమేయాత్మనే నమః
ఓం శుభప్రదాయ నమః
ఓం కృతయే నమః
ఓం పాపనాశాయ నమః
ఓం తేజసే నమః
ఓం గణపతయే నమః
ఓం యోగాయ నమః
ఓం దీర్ఘాయ నమః
ఓం సుతీర్థాయ నమః
ఓం అవిఘ్నే నమః
ఓం ప్రాణదాయ నమః
ఓం మధువే నమః
ఓం పునర్వసవే నమః
ఓం మాధవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం సిద్ధయే నమః
ఓం శ్రీబలాయ నమః
ఓం నవనాయకాయ నమః
ఓం హంసాయ నమః
ఓం బలినే నమః
ఓం బలాయ నమః
ఓం ఆనందదాయ నమః
ఓం గురవే నమః
ఓం ఆగమాయ నమః
ఓం అనలాయ నమః
ఓం బుద్ధవే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం సుఫలాయ నమః
ఓం జ్ఞానదాయ నమః
ఓం జ్ఞానినే నమః
ఓం శశిబింద్వాయ నమః
ఓం పవనాయ నమః
ఓం ఖగాయ నమః
ఓం సర్వవ్యాపినే నమః
ఓం రామాయ నమః
ఓం నిధియే నమః
ఓం సూర్యాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం అనాదినిధనాయ నమః
ఓం పవిత్రాయ నమః
ఓం అణిమాయ నమః
ఓం పవిత్రే నమః
ఓం విక్రమాయ నమః
ఓం కాంతాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం దేవాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం మృదవే నమః
ఓం అక్షయాయ నమః
ఓం తారాయ నమః
ఓం హంసాయ నమః
ఓం వీరాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం సులభాయ నమః
ఓం తారకాయ నమః
ఓం భాగ్యదాయ నమః
ఓం ఆధారాయ నమః
ఓం శూరాయ నమః
ఓం శౌర్యాయ నమః
ఓం అనిలాయ నమః
ఓం శంభవే నమః
ఓం సుకృతినే నమః
ఓం తపసే నమః
ఓం భీమాయ నమః
ఓం గదాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం లోహితాయ నమః
ఓం సమాయ నమః
ఓం అజాయ నమః
ఓం వసవే నమః
ఓం విషమాయ నమః
ఓం మాయాయ నమః
ఓం కవయే నమః
ఓం వేదాంగాయ నమః
ఓం వామనాయ నమః
ఓం విశ్వతేజాయ నమః
ఓం వేద్యాయ నమః
ఓం సంహారాయ నమః
ఓం దమనాయ నమః
ఓం దుష్టద్వంసాయ నమః
ఓం బంధకాయ నమః
ఓం మూలాధారాయ నమః
ఓం అజాయ నమః
ఓం అజితాయ నమః
ఓం ఈశానాయ నమః
ఓం బలపతే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం సుఖదాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం క్రూరనాశినే నమః
ఓం భోగాయ నమః
ఓం శుభసంధాయ నమః
ఓం పరాక్రమాయ నమః
ఓం సతీశాయ నమః
ఓం సత్పలాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం బ్రహ్మాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాథదేవాయ నమః
త్రినాథ వ్రత కథ
మధుసూదనుని కథ 
భక్తులారా ! మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాధుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె నుండును. శ్రీపురము అను గ్రామము నందు మధుసూదనుడను నొక బ్రాహ్మణుడుండెడివాడు. మిక్కిలి దరిద్రుదగుటచే బిక్ష మెత్తుకుని జీవించే వాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున అ బాలుని శరీరము దిన దినము కృశించు చున్నది. ఆ బాలుడు చిక్క పోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. "అయ్యా ! నేను చెప్పెడి మాట శ్రద్దగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవు నొకటి తీసుకోండి " అని చెప్పగా ఆ మాట విని భర్త యేమని చెప్పు చున్నాడంటే 'ఓసీ' నీకు వెర్రి పట్టినదా ? మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఏలాగున దొరుకుతుంది ? ధన రత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ? ఎవరికైతే ధన సంపదలు కలిగి యుండునో, వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది . అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడగుతారు. అని బ్రాహ్మణుడు చెప్పెను. బార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మ దేవుడా ! నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించు చుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతా క్రాంతుడై విచారించి, తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి, ఆ వచ్చిన సొమ్ము అయిదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి, పెనిమిటిని చూచి అయ్యా ! ఈ సొమ్మును తీసుకు వెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకు రండని చెప్పినది.
అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచూ, పెద్ద భాగ్య వంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నియు పాలతో నిండి యున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా యున్నది. తన ఆవులలో 'భోదా' అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్ట బుద్ధి గలది. బైటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తిని వేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో యేమను చున్నాడంటే "ఇక దీని ముఖము చూడకూడదు. అవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను" అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో యిట్లనెను. "షావుకారూ! వినండి 50 రూపాయలు ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను ఆవూ దూడా రెండిటిని నాకు ఇప్పించండి" అని అనగానే "ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా" అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు "మీరు షావుకార్లు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు" అని అన్నాడు . ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని, తన మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా ! అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించ లేదు. ప్రొద్దు పోయెడి వేళయినది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదక బోయినాడు. వీధుల్లోనూ, సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోను చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచినాడు.
మధు సూదనునకు త్రినాధ దేవులు దర్శన మిచ్చుట 
అది ఒక గొప్ప మర్రి చెట్టు, పైన ముగ్గురు మనుష్యులు కూర్చుని వున్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని, లేచి పోవుచుండగా, త్రిమూర్తులు బ్రాహ్మణునితో 'ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది ? నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు ? ఆ సంగతి మాతో చెప్పు " మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి "అయ్యా ! నేను కడు బీదవాడను బిక్ష మెత్తుకుని బ్రతికే వాడను నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించట్లేదు ఈ దినము శ్రీ పురము సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్లి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంత లోనే అమ్ముతారు గదా ! త్రినాధ స్వాములారా ! ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను." అని తన సంగతి చెప్పెను.
అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు యేమి చెప్పుచున్నారంటే "నీ వేలాగూ సంతకు వెళ్లుచున్నావు కనుక, మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను" అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు "యేమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు యిట్లనిరి. ఒక్క పైసా ఆకు చెక్క, ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు యేమని చెప్పు చున్నాడంటే " ఓ త్రిమూర్తులారా ! నాకు పైసాలు ఎక్కడ దొరుకును ? నేను బీదవాడను గదా ? బిక్ష మెత్తుకుని జీవించు చున్నాను." అని అనగా, త్రిమూర్తులు యేమి చెప్పు చున్నారంటే "ఓ బ్రాహ్మణుడా ! విను, అదిగో ఆ గోరంట పొద కనిపించు చున్నది కదా ! దాని మొదట మూడు పైసాలున్నవి" ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగే సరికి మూడు పైసాలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు నింకను పైకి లాగు చుండెను అది చూచి త్రినాదులవారు "బ్రాహ్మణుడా ! నీకు వెర్రి పుట్టినదా ? అందులో పైసలు ఇంకా లేవు. ఎంత దొరికినదో అంతే యుండును" అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని, అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి. "ఓ విప్రుడా ! తిరిగి ఎందుకొచ్చావు" అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులన్నారు. అందులకా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది ? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెబుతున్నారు అనగా "ఓయీ ! నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీ పురం సంతలో ప్రవేశించినాడు. వెళ్లి చూడగా ఆవు కనిపించ లేదు .
త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట 
ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని, నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో "ఒక్క పైసా నూనె గావంచ లో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , "ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు. అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు "దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్ర మిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు "ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను" అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను. అంతియే, తెలికలవాని కుండలో నూనె కొంచమైననూ లేకుండా పోయినది. అది చూచి తెలికలవాడు మూర్చపోయినాడు. తెలికల వాళ్ళందరూ పరిగెత్తు కొచ్చి ముసలివాని ముఖముపై నీళ్ళు చల్లి, సేదతీర్చి కూర్చుండ బెట్టినారు. ఏమి చెప్పుదను ? ఎక్కడ నుంచో ఒక భ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపొయినాడు. ఈ లాగున అందరూ విచారించి పరుగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు. "విప్రుడా ! విను మీరు నూనె కొన్నారు కదా ! అది కొలతకు తక్కువగా యున్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి" అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి, ముందు తెచ్చిన దుత్త తోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలెనే దుత్త భర్తీ అయిపోయినది . అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలవి కాపోయినది. విప్రుని గావంచాలో చమురు ఉంచినారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి శలవు అడిగినాడు .
త్రినాధుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట 
శలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే "ఓయీ ! నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది .ఒక మాట విను .నీవు త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటా పంచలై అధిక సంపదలు కల్గునని త్రినాధులనగా అది విని "స్వామీ ! ఏయే వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాధులు ఇలాగన్నారు . 'ఓ ద్విజుడా ! వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. మూడు మట్టి చిలుమల యందు గంజాయి నలిపి, అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి, వత్తులు వేసి, ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి, రాత్రి తొలి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్ధములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును." అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంబించి, గంజాయి ముందు తయారు పరచినాడు. అప్పుడు త్రిమూర్తులు "నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడను బిక్ష మెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను, దీపము ముట్టించుటకు అగ్గి లేదు నాగావంచా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్దితో పూజ చేస్తాను ? అని ఏవగించు కుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు "ఓ ద్విజుడా ! మదిలో చింత పడకు .నీ ఆవు పెయ్యా దొరుకుతాయి. నీవు నీ కుటుంబము, సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి " స్వాములారా ! అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే ! నేను ఏమి చేయగలను ? అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు "ఓ బ్రాహ్మణుడా ! నీ రెండు నేత్రములు మూసుకో" వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి, సాష్టాంగ దండ మొనరించినాడు.
త్రినాధులు బ్రాహ్మణుని అనుగ్రహించుట 
త్రిమూర్తుల వద్ద శలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళు చుండగా త్రోవలో ఆవును, దూడను చూసి సంతోషించి " త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును ,పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను" అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది, కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు. చేయ వలసిన కార్యక్రమముల నందరికీ విశదముగా తెలియ పరచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనె మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్దతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాధ పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు .
రాజు త్రినాధులను తూలనాడి మేళాను నిషేదించుట 
వారిని చూచి రాజు "మీరందరూ యెందుకు వచ్చినారు ? అని అడుగగా "అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలయును మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు బిక్ష మెత్తుకుని జీవించెడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాధ మేళాను ఆచరించినాడు .త్రినాదులు యే దేవతలో ? వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులు యావన్మంది త్రినాధ మేళా చేసినారు గ్రుడ్డివారు, కుంటివారు, అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమంది నారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు.మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఏలాగున జరుగుతాయి !" అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు. "త్రినాదులు అనే దేవతలు యేమి దేవతలు ? వారిని మీరు యెందుకు పూజించు చున్నారు ? నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది. అటుల కాని యెడల శూలం వేయబడునని రాజు గారు ప్రజలందరికి తాఖీదు ఇచ్చి పంపినారు.
త్రినాధులు రాజుపై కోపించుట - యువరాజు మరణము 
ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించి నారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించు చున్నది .ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు .రాజు దైవ కృప, తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చు చున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించు చున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు.
త్రినాధుల దయతో యువరాజు బ్రతుకుట 
త్రినాదులకు దయ కలిగినది "రాజ కుమారుని బ్రతికించి వెతుమా ! మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును." అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూసి "మీరందరూ ఈ నదీ తీరమునకు యెందుల కొచ్చినారు ? ఏల విచారముగా కూర్చున్నారు. ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని యున్నాడు ? ఇతని శరీరములో చల్లదనము కలదే ? అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. "మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషము చేసెనో కాని ఈతడు చనిపోయినాడు. " అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాధుల వారికి రాజు అపరాధము చేసినందు న ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాధులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాధ మూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాధ స్వాముల పేరు ఆ రాజ తనయుని చెవిలో చెప్పినారు. ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరును సంతోషము ను పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటినుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి .
వర్తకుడు త్రినాధుల మేళా చేయుటకు మ్రొక్కుకొనుట 
అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ వూరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకు వెళ్ళు చుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నది తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి జనులారా ! త్రినాధుల పేర్లు యేమి పేర్లు ? మీరేల స్మరించు చున్నారు ? వినడానికి శ్రద్దగా ఉన్నవి. అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా ! వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాధ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు గారు మన్నించ నందున అపరాదుడైనాడు . ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుట చే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని యున్నాము. ఇది చూచి ప్రభువులకు దయకలిగినది వచ్చి వీనిని బ్రతికించి నారు . అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము .వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని ,షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు లేక్కడుందురో ? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను .నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకొని యున్నవి నేను ఈ ఒడపై వెళ్లి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను . నాకు వ్యాపారంలో నష్టము రాక పోయినట్లయిన ప్రభువులవారికి ఐదు మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపొయినాడు. పైదేశము వెళ్లి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.
మేళా చేయక పోవుటచే ఓడ మునుగుట 
తన నౌకర్లందరూ ఓడ లోని ధనము మోసుకొని పోయినారు.ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువులవారి మేళాలు మరిచెను . అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది . నౌకర్లు, ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగి పోయిరి .అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంత సేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చు చుండగా ఆకాశములో నుండి త్రినాధులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు. అందుచేతనే ఓడ మునిగినది . నీవు ఐదు మేళాలు సమర్పించి నట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును. అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసియుంటిని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాదులవారికి మేళా ఇస్తాను. అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులవారికి మేళా సమర్పించి ప్రార్ధించినాడు .నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది .అదిచూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకలు నౌకర్లు, ఓడలో గల మిగిలిన ధనము కొని పోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను.గంజాయి ఆకులు ,చెక్కలు అన్నీ స్వామి వారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేసినారు .రాజ్యమంతా త్రినాధ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించి నారు.మేళాను చూచుటకు అంతా వస్తున్నారు .
గ్రుడ్డివానికి చూపు - కుంటివానికి కాళ్ళు వచ్చుట 
ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో అన్నా మీరెవరు మీపేరేమిటి ? మీరెక్కడకు వెళ్ళు చున్నారు ? అనెను వారు మేళా చూచుట కనిరి .అది విని గ్రుడ్డి వారు నాకు కండ్లు కానరావు .మీరందరూ నేత్రములతో చూస్తారు .నేను దేనితో చూస్తాను. అని అనగా గ్రుద్దివాడా ! త్రినాధ స్వామీ వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనపడును. ప్రభువుల వారి మహిమ చూడ వచ్చును. అని చెప్పి ,వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు .గ్రుడ్డి వాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కన్పించినవి .అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు .దారిలో ఒక పొట్ట వాడు కూర్చుని యున్నాడు .వానిని చూసి నీవు గ్ర్ద్ది వాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్లుచున్నావు అని అడిగినాడు .గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు .అన్నా ! నేను మేళాను చూచుటకు వెళ్ళు చున్నాను ఆ మాటలు పొట్టవాడు విని " స్వామి వారి దయ నా మీద లేదు .చేతులు ,కాళ్ళు ,పొట్ట ,నేనెలాగున నడువగలను? నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు , అంత గ్రుడ్డివాడు చెప్పు చున్నాడు " నీవు త్రినాధ స్వామి వారి ని భజింపుము .నీ కాళ్ళు చేతులు బాగౌతవి .క్షణంలో ఇద్దరం కలసి వెడలిపోదాము.నేను కేవలం గ్రుడ్డివాడిని ఎ మాత్రం కన్నులు కనిపించుటలేదు .త్రినాధ స్వామి వారిని భజించి నాను కనుక ,కొంచెము కనిపిస్తున్నది .అందుచే ,నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు . అని చెప్పగా పొట్టవాడు త్రినాధా! త్రినాధా ! అని భజించినాడు..గ్రుడ్డి అన్నా ! నీకు కాళ్ళున్నవి ,నడవ గలవు, నేను ఎలాగు నడవ గలను .నన్ను నీ భుజము మీద కూర్చో బెట్టుకొన నెమ్మదిగా నడచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా ఇద్దరమూ మేళాకు చేరుకుందాము. అని పొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గ్రుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చో బెట్టుకుని మెల్లగా నడచి పోతున్నాడు.నేస్తం ! నా నేత్రాలు నిర్మలంగా కనిపించు చున్నవి అని అనగా పొట్టవాడు అయ్యా ఇప్పుడు నడచి పోగలను ఈ విధంగా గ్రుడ్డివాడు ,పొట్టవాడు కలసి త్రినాధ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించి నారు .
త్రినాధులు వైష్ణవ భక్తుని రక్షించుట - మూర్ఖపు గురువును శిక్షించుట 
ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యమూ ఒక వైష్ణవుడు వస్తూ ఉండెడివాడు .అతడు త్రినాధ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు.అతనిని ఈ ప్రొద్దు మన స్థాన మందు కూర్చుండ బెట్ట వద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించ కుండా నీవు వెళ్ళు చున్నావు. కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది .అని చెప్పగా వైష్ణవు డేమి అంటున్నాడనగా నాయనలారా ! అపరాధము క్షమించండి . ఇకనుండి మేళా కాకుండా వెళ్ళను.నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను .దైవ యోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు ? ఆ దినము అగుపించలేదే ? మని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులకా ముసలిది అది త్రినాధుని మేళా అని చెప్పినది .ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్దలతో పూజ చేయుచున్నారు .అది చూచి గురువుకు కోపం వచ్చి ,బాగా తిట్టి ,మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు .తరువాత వైష్ణవుని పట్టుకుని బర బరా లాక్కు పోయాడు .కొంత దూరము వెళ్లేసరికిబోరున వర్షము కురియసాగినది .కటిక చీకటి కావడం వలన త్రోవ కన్పించడము లేదు గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా ,అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చు చున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య ,కుమారుడు చనిపొయినారు.
గురువు పశ్చాత్తాప పడి మేళా చేయగా త్రినాధులు కరుణించుట 
వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండ బెట్టి ,ముఖముపై నీళ్ళు చల్లి" అయ్యా ! తమరు త్రినాధ స్వామివారికి అపరాదులు, త్రినాధ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము .మీరు నిష్టతో స్వామీ వారి మేళాను చేసిన యెడల మీ భార్యా కుమారులు బ్రతుకుతారు." అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా ,వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాధ మేళా పాడుచేసినందుకు తగిన శిక్ష దొరికింది ."నేను మూర్ఖుడను ,అధముడను ప్రభువులవారి మహిమ తెలిసికొనలేకపోతిని " అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్దములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు . నూనె కాండము చెల్లినది .ప్రభువుల వారి పూజ కావచ్చినది .ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమనుభవించినారు.
బొద్దు పాఠ్యం
Insert non-formatted text here==ఫలశ్రుతి== ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డి తనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన యెడల నడ్డి తనము, గ్రుడ్డి తనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. మూడు దీపములు వెలిగించి "ఓ త్రినాధ స్వాములారా దయ చేయండి" అని అనవలయును. అంతా సమర్పించి త్రినాధ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించ వలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి " అని ఈ కథను సీతా దాసు చెప్పి యున్నారు.
మంగళహారతి
శ్లో || మంగళం భగవాన్ విష్ణు : మంగళం మధుసూదన
మంగళం పుండరీ కాక్ష మంగళం గరుడధ్వజ
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
శ్రీ లక్ష్మీ ప్రాణ నాదాయ జగన్నాదాయ మంగళం. ||
దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాధాయ మంగళం.
శ్రీ త్రినాధ మేళా సమాప్తం
Trinadha vratakalpamu
Bhusuddi: 
Space at the northeast corner of the Pure, and eating, either rice flour, colored powder or mulato, three in the divine, in order to establish a pitanu My doses. The plateaus are either too tall, too slope should not be either. Then the pitaku well written, yellow, saffron bottupetti, rice flour (rice flour) with three doses. Eight fighters generally let padmanne. Puja, who used to sit facing the east. That the Lord of the Divine pujinja botunnaro pratimanugani, Chitra map either to put on the plate. Ganapatini yellowish made in advance (yellow dough, about an inch in size and shape trikona) and put a drop of saffron, and then a plate, either on new tundugudda Pour over the rice in a betel leaf, the yellow press Ganapathy hoist from the agar. Now amarcukovali worship materials. Paradhana to be in the direction of the southwest.
Diparadhanaku the desired objects - Deeparadhana Procedure: 
Deeparadhana make a proved (speech) of silver or brass, either can use either level. Aquarius Kunda 3 horizontal press 1, press (in the middle) and tadupavalenu oil. Another cross-oil-soaked press of a single haratilo (Karpura haratiki used object) and a pre-drilled single haratilo stick hitting the fire lit, pressing a lit candle, moved 1 horizontal and 1 lit candle shall Aquarius. Akshata and Lakshmi Deeparadhana after assuming a form to be worshiped. Incense at the altar of the cross is shown in the rest of Kunda press Use the lamp to show. Diparadhanaku nunegani sesame, coconut nunegani, the cow can use neyyigani. In this way, the lamp lit, playing No. ghantanu caduvukonavalenu the following verses.
Ghantanadamu: 
Slo || Aug mardhantu devanam gamanardhantu amulet Sam 
Angel vantatra kuryadghantara formalities Phnom hvahana 
Aca we worship God, we've listened to five character yogincaradu in the water. A glasugani worship separately, taking its pure waters cembugani kalasaradhana ewer and the worship of God to Use only the water. 
The desired objects of worship: 
Containing Tulsi Vishnu (what does (worship) acarincucunnamo that God's image (image) (the energy source with the gold, silver, or made any inquiry shall tisukona), or Chitra Map
Tags: Trinadha vrathakalpam telugu, Trinadha vratha kalpam in telugu, Telugu Trinadha vratha kalpam, Trinadha VRATHA KALPAM TELUGU, Trinadha VRATHAM TELUGU, sri Trinadha vratha kalpam in telugu, TRINADHA VRATHA KALPAM TELUGU, Trinadha Vratha Kalpam telugu, Trinadha Vratham in telugu, IN TELUGU Trinadha vratham