Search This Blog

Chodavaramnet Followers

Monday 22 September 2014

WHAT IS THE REASON FOR NOT REMOVING NAILS ON TUESDAY'S


ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం.

శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మనవాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అన్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారములు క్షౌరానికి ప్రశస్తం. శని ఆది వారాలు మధ్యం. మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే (ఆధునిక భాషలో చెప్పాలంటే cutting) గోళ్ళు తీసుకోవాలి. గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన (Metabolism) నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని గోళ్లుగా పెరుగుతాయి. కనుక వీటిని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పబడిన తిథులలో, వారాలలో సమయాలలో మాత్రమే తొలగించాలి. స్నానానికి పూర్వమే తొలగించాలి. గోళ్ళతో యే వస్తువును త్రుంచకూడదు. ఇంటిలోకాకుండా ఇంటిబయట తొలగించుకోవాలి. అసలు జీర్ణం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే వెంట్రుక. అలాగే గోళ్ళు కూడా. కనుక గోళ్ళు ఇంట్లో తీయడం దరిద్రం అని ఎందుకు అన్నారంటే దానిని తొక్కినా, అన్నంలో కలిసినా సమస్యలొస్తాయి. మానవుడు ఆచరించే పాపాలు అధికం జుత్తును, గోళ్లను ఆశ్రయించి ఉంటాయి. కనుక వీటిని తొలగించడానికి ఇంత నేర్పరితనం కావాలి. గోళ్ళను పెంచుకోకూడదు. దీనికి ఒక కథ ఉంది వేదంలో. పాపాలన్నీ సూర్యుడి దగ్గరికి పోయాయి. మీరు నాదగ్గర ఉండకూడదు తిరిగిపోండి అన్నాడాయన. ఎక్కడికి పోవాలి? అని ఆ పాపాలు సూర్యుడిని అడిగితే గోళ్ళను ఆశ్రయించండి అన్నాడట. దీనిని ఆధారంగా గోళ్ళు పెంచుకోకూడదు అని నియమం పెట్టారు