టీతో మృత్యువు దూరం
మీకు టీ తాగే అలవాటు ఉందా?
ఒకవేళ లేకపోతే.. ఇక నుంచైనా తాగేందుకు ప్రయత్నించండి!
ఎందుకంటే టీ తాగే వారిలో మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అని పరిశోధనలో తేలింది. గుండె జబ్బులతో కాకుండా ఇతరత్రా కారణాల వల్ల కలిగే మరణాలు 24 శాతం తగ్గుతాయని వెల్లడైంది. బార్సిలోనాలోని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ దీనిపై పరిశోధనలు చేసింది. 2001 జనవరి నుంచి 2008 డిసెంబర్ మధ్యకాలంలో వైద్య పరీక్షలు చేయించుకున్న 1,31,401 మంది 18నుంచి 95 ఏళ్ల వయసు వారి వైద్య రికార్డులను పరిశీలించారు. అందులో 95 మరణాలు హృదయ సంబంధమైనవి కాగా, 632 మరణాలు మాత్రం ఇతర కారణాల వల్ల సంభవించినవని అధ్యయనంలో తేలింది. తదనుగుణంగా వాటిపై టీ, కాఫీల ప్రభావాన్ని అంచనా వేశారు. కాఫీ తాగని వారితో పోలిస్తే తాగే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తేలింది. అయితే వీటికి భిన్నంగా టీ తాగే వారికి గుండె జబ్బుల ప్రమాదం తక్కువ అని తెలిసింది. బీపీ పైనా టీ ప్రభావం తక్కువేనని తేలింది. రోజుకు 1-4 కప్పులు తాగే వారిలో 24 శాతం, 4 కన్నా ఎక్కువ కప్పులు తాగే వారిలో 29 శాతం ఈ రిస్కు తక్కువట!