Search This Blog

Chodavaramnet Followers

Saturday, 27 September 2014

KNOW ABOUT DIRECTIONS IN TELUGU


ఉత్తరం దిక్కు 

మనిషి శక్తికి ముఖ్యమైనది ఆహారం. ఆ ఆహారంలో ఎన్నో రకాలున్నాయి. వివిధ రకాలుగా వివిధ రుచులతో ఇష్టమైన రీతిలో ఆహారాన్ని తయారు చేసుకుని కడుపారా ఆరగిస్తుంటాం. ఆ వంటకాలు ఎంతో శుభ్రంగానూ, రుచిగా.. ఆరోగ్యకరంగా కూడా ఉండాలని భావిస్తాం.
అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వకాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.

తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.
ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్‌పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి.