Search This Blog

Chodavaramnet Followers

Sunday, 7 September 2014

ARTICLE ON LORD ANANTHA PADMANABHA SWAMY VRATHAM IN TELUGU


అనంత పద్మనాభ వ్రతం 

అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు (ఇంగ్లిష్ క్యాలడర్ ప్రకారము ఒక్కోసంవత్సర్ము ఒక్కో తేదీ ) శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి.

పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి.

పద్మానికి నడుమ దర్భలతో తయారు చేసిన ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి బొమ్మను పెట్టాలి. దర్భలతో చేసిన ఆ బొమ్మలోకి అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేయాలి. ఎర్రని రంగులో ఉండే 14 ముడులతో ఉన్న తోరాన్ని స్వామి దగ్గర ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలని పురోహితులు చెబుతున్నారు.

ఇలా పద్మనాభ వ్రతాన్ని ఆచరించే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంకా అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించిన భక్తులు ఆ రోజున తమకు వీలైనంత దానధర్మాలు చేయడం ద్వార మోక్షఫలములు, పుణ్యఫలములు, అష్టైశ్వర్యాలు పొందుతారని పురోహితులు సూచిస్తున్నారు.
అనంత పద్మనాభుని మహిమ :
కృతయుగములో సుమంతుడు , దీక్ష అనే దంపతులు ఉండేవారు . వారికి " శీల " అనే కుమార్తె కలిగింది. శీల పుటీన కొంతకాలానికి దీక్ష మరణించడముతో సుమంతుడు " కర్కశ " అనే మహిళని వివాహము చేసుకున్నాడు . శీలను సవతితల్లి కర్కశ అనేక కష్టాలకు గిరిచేసింది. ఒక సారి కౌండిన్య మహర్షి సుమంతుడు ఇంటికి వచ్చి శీలను చూసి సుమంతుడి అనుమతితొ శీలను వివాహము చేసుకున్నాడు . శీలను వెంటబెట్తుకొని తన ఆశ్రమానికి బయలు దేరిన కౌండిన్య మహర్షి మధ్యాహ్న సమయానికి నదీ తీరానికి చేరి విశ్రమించాడు . ఆ సమయములో నదీతీరములో కొందరు స్త్రీలు ఎదో వ్రతము చేస్తూండడము గమనించిన శీల వారి దగ్గరికెళ్ళి - దానిని గురించి తెలుసుకొని వారి సహాయము తో శీల కూడా ఆ వ్రతాన్ని ఆచరించి , చేతికి తోరమును ధరించి , భర్తతో కలిసి సాయంత్రానికి ఆశ్రమానికి చేరుకుంది. ఈ విధముగా అనంతవ్రతాన్ని ఆచరించిన ఫలితము గా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించాయి.

కొన్ని రోజులు గడిచాక కౌండిన్యుడు తన భార్య్ శీల చేతిలోని తోరము ను గమనించి " ఏమిటిది ? నన్ను వశపరచుకోవడానికి కట్టుకున్నావా? " అని కోపముగా ప్రశ్నించినారు. భర్త కోపావేశాన్ని చూసి భయపడిన శీల , తను చేసిన అనంత వ్రతము గురించి వివరించింది . ఐతే కౌండిన్యుడు ఆ మాటలను లెక్క చేయక శీల చేతికి ఉన్న తోరమును తెంచి మంటల్లో పడేశాడు . అప్పటినుండి ఆశ్రమం లో దారిద్ర్యం తాండవించసాగింది. ఇలా ఎందుకు జరుగుతుందో తెల్సుకునే ప్రయతన్ములో అనేక రకాల ఆలోచనలు చేసి చివరకు అనంతవ్రతాన్ని ఆక్షేపించడమేనని తెలుసుకొని పశ్చాత్తాపముతో " అనంతపద్మనాభుడి " కోసము అడవికి ప్రయాణమయ్యెను . మార్గమధ్యములో ... ఒక పక్షి కూడా వాలని ఫలపుష్పాలతో కూడిన మామిడిచెట్టు , పచ్చగడ్డిలో మేయకుండా తిరుగుతూవున్న ఆవు, పచ్చిక బీడు పై పడునివున్న ఎద్దు , కమలాలతో నిండిన సరోవారాలు , గాడిద , ఏనుగులు కనిపించా , అనంతుడ్నిగురించి వాటిని కౌండిన్యుడు అడిగాడు .. అవన్ని తెలియవని చెప్పగా చివరికి ప్రాణత్యాగానికి సిద్ధమయాడు. ఇలాంటి పరిష్తితులలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కౌండిన్య మహర్షి ముందు ప్రత్యక్షమై .. అతనికి ఒక గుహలోనికి తీసుకువెళ్ళి అనంత పద్మనాభుడి గా దర్శనమిచ్చాడు . స్వామిని కౌండిన్యుడు క్షమించమని వేడుకుని ప్రాయశ్చిత్తము చెప్ప్పమని ప్రాధేయ పడ్డాడు . అందుకు " ప్రతి సంవత్సరమూ భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు అనంతపద్మనాభ వ్రతము ఆచరించు , ఇలా 14 సం.లు ఆచరించు అనిచెప్పి ... అన్నికష్టాలు తొలగిపోతాయని ఉద్భోదించెను.

అడవి మార్గం లో కనిపించినవాటిని గురించి ప్రశ్నించగా.... మామిడిచెట్టు పూర్వజన్మలో విద్యావేద విశారదుడగు విప్రుడు , విద్యాదానము చేయక చెట్టుగా పుట్టినది. ఆవు విత్తులను హరిందు భూమి , ఎద్దు ధర్మస్వరూపము , పుష్కరిణులు రెండు అక్కచెళ్ళెల్లు ... దానధర్మాలు చేయక అలా జన్మనెత్తారు. గాడిద క్రోధము , ఏనుగు మదము . నీవు ప్రవేశించిన గుహ సంసారము . వృద్ధుడను నేనే .అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యెను. కౌండిన్యుదు ఆశ్రమానికి చేరి ప్రతి సం. ము వ్రతాన్ని ఆచరించసాగాడు . ఫలితము గా ఆశ్రమం అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో నిండింది . ఇలా శాస్త్రోక్తము గా అనంతుడిని పూజించడము వల్ల సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకము .

వ్రతవిధానము : ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షత లు
జల్లుకోవాలి
వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .

ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది.

పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్లకొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.