ఏటీఎం రూల్స్ మారుతున్నాయ్.. నెలకు రెండు సార్లే..?
మీ బ్యాంకు వేరేదైతే ఇతర బ్యాంకు ఏటీఎంలను బాగా ఉపయోగిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ కొన్ని పరిమితులు విధించింది. ఇప్పుడు ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
ఆపై ప్రతి ట్రాన్సాక్షన్‌కు కొంత రుసుమును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. కాగా, ఇక నుంచి నెలకు రెండు సార్లు మాత్రమే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునే వీలుంది. ఆపై ట్రాన్సాక్షన్‌లకు మాత్రం ఛార్జీలు తప్పవు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ నిబంధనలు వర్తించవని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.