Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 17 December 2013

PANCHAMUKHA HANUMAN - LORD HANUMAN PRAYER IN TELUGU BHAKTHI ARTICLES COLLECTION


 'హనుమద్ర్వతం' ఆచరించటానికి పవిత్రమైన రోజు. 
కేవల స్మరణమాత్రాన బుద్ధి, బలం, ధైర్యం, యశస్సు, వాక్పటిమ ప్రసాదించే ఆంజనేయస్వామిని పూజించడం వల్ల సర్వభయాలు నశిస్తాయని గ్రహ, పిశాచ పీడలు దరి చేరవని, మానసిక వ్యాధులు తొలగిపోతాయని అనాదికాలం నుంచి విశ్వాసం. అటువంటి ఆంజనేయమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతం 'హనుమద్ర్వతం'. మార్గశిర మాసంలో శుక్ల పక్ష త్రయోదశినాడు ఈ వ్రతం ఆచరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 
పూజామందిరంలో బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని చిత్రించి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటుచేసి దాన్ని పసుపు, కుంకుమ, గంధం, సింధూరం, పుష్పాలతో అలంకరించాలి. కలశం ముందర స్వామివారి చిన్న విగ్రహాన్ని గానీ, చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకుని కలశంలోనికి స్వామివారిని ఆవాహన చేసుకుని వినాయక పూజ, పిమ్మట స్వామివారి పూజ ఆచరించాలి. షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. గోధుమతో చేసిన భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించాలి. 13 పోగులు ఉన్న తోరాన్ని స్వామివారి వద్ద ఉంచి పూజించి ధరించాలి. వ్రతకథా శ్రవణం చేయాలి. రాత్రి ఉపవాసం చేయాలి. తోరాన్ని మరుసటి ఏడాది వరకు భద్రంగా ఉంచుకోవాలి. ఏడాది తరువాత కొత్త తోరం ధరించాలి. ఈ విధంగా 13 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. కనీసం ఒకసారైనా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ వ్రతాచారణం వాళ్ళ సమస్యలు, కష్టాలు, తొలగిపోయి, సుఖశాంతులు, సౌభాగ్యం, జ్ఞానం లభిస్తాయని విశ్వాసం.
పాండవులు వనవాసంలో ఉండగా వ్యాసమహర్షి వారిని చూసేందుకు వెళతాడు. ధర్మరాజు తమ కష్టాలు తొలగిపోయే మార్గం ఉపదేశించమని ప్రార్ధిస్తాడు. అప్పుడాయన ఈ 'హనుమద్ర్వతాన్ని' ఆచరింపజేసినట్లు పురాణ కథనం. భీముడు, అర్జునుడు కూడా వేరువేరుగా ఈ వ్రతాన్ని ఆచరించి అజేయులయ్యారని చెబుతారు.