Search This Blog

Chodavaramnet Followers

Saturday 7 December 2013

BHAKTHI ARTICLE ON "OM - HARI OM" IN TELUGU BHAKTHI ARTICLES COLLECTION



హరి ఓం.
అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అందులో దేవి భాగవతం, కృష్ణ భాగవతం. ఇవి రెండు మాత్రం ముఖ్యమైనవి.

ద్వైతులు కృష్ణభాగవతంను "శ్రీమద్భాగవతం"గా పిలుస్తారు.
కాని,
దేవి భాగవతం అయిన శ్రీ మద్భాగవతం అయిన వివరించేది ఒకే అంశం..,
"దుష్ట సంహారం కోసం భగవద్స్వరూపం ఈ కాలానికి అనుగుణంగా మానవ స్వరూపం స్వీకరించటం జరుగుతుంది. దుష్ట సంహారం కోసం భగవంతుడు దిగి రావటం జరుగుతుంది".

ఆపదలో ఉన్నవాడిని కాపాడిన వాడు "భగవంతుడు" అని భాగవతం చెప్తోంది.

భగవంతుడు దుష్ట సంహారం కోసం మానవ జన్మ స్వీకరించటానికి కారణం:-
శక్తి స్వరూపంలోని భగవంతుడి కాలం లేక సమయము మరియు మానవ కాలం లేక సమయము ఒకటి కాదు. మనం ముందు చూసాము కదా ఈ వేదప్రసాదం(వేదం)లో మొదట ప్రస్తావించిన విదంగా భగవంతుడి వయస్సు ఎంతో ఆయనిప్పుడు మనకంటే ఎంత ముందు ఉన్నాడో. కాల భేదం ఉన్నందు వలన ఇక్కడి పరిస్థితులను అర్ధం చేసుకోవాలి అంటే మానవ జన్మ ఎత్తాల్సిందే.
అదే రామ, కృష్ణ అవతారములకు కారణము.
మానవ స్వరూపం స్వీకరించటంలో ఇది ఒక కారణం.
ఇంకా ఇచ్చిన వరాలు, ఆయన చేసిన కర్మలు కూడా ఆయన మానవ జన్మకు కారణం అవుతాయి. ఇలా చాలా కారణాల వలన దుష్ట సంహారం కోసం మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది.

భాగవతంలోని ముఖ్యమైన అంశాలు మీ దగ్గర ప్రస్తావించటం జరుగుతుంది.
వాటికంటే ముందుగా మనం ఈ రోజులలో మతంగా పిలుస్తున్న హిందూ అను పదం మతం కాదు అని హిందూ అనేది సనాతనంగా మనం పాటిస్తున్న "ధర్మం" అని నమ్మకంగా చెప్పే ధైర్యాన్ని కలిగించే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను.

అందులో భాగంగా
అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, శాక్తేయం, వైష్ణవం, శైవం.
వీటిని మతాలూ అంటారని మీకు తెలుసు అనుకుంటున్నాము. ఇస్లాం మరియు బ్రిటీష్ దురాక్రమణల తరువాత ఇప్పుడు నాస్తికవాదం ప్రభలింది కాని వాటికి ముందు ఉన్న మతాలు ఇవే. ఎవరు దేనిని నమ్మితే వారు ఆ మతం వారు అయ్యేవారు. ఆ విదంగా ఒకే కుటుంభంలో వివిధ మతాలుండేవి. అన్ని ఒకే అంశాన్ని వివరించేవి. పరమార్ధం ఒకటే ఉండేది. కాని ఒకేఒక్క విషయంలో ఒకదానితో ఒకటి విభేదించి పోటీపడి అన్ని కోణాల్లోనూ ఐకమత్యాన్ని చెడగోట్టేవి.
ఈ ఐకమత్య లోఫమే శత్రు సైన్యాలకు అవకాశంగా మారింది. అప్పటి సంగతి పక్కన పెడదాం ఇప్పుడైనా వీళ్ళ మద్య ఐకమత్యం ఉందా??? ఉంటె ఆనందం.
కాని వీటిలో ఒకటి అన్నింటిని అంగీకరిస్తుంది. దానినే మేము నమ్ముతున్నాము. దానిని మేము మీకు చెప్పము. మా వివరణ అయిపొయ్యాక మీరే ఇందులో ఒకదానిని స్వీకరించండి(బాప్తిసం లాగ బ్రతికుండగానే, చావకుండానే పునర్జన్మ ఎత్తండి జన్మరాహిత్యులవుతారు ఎన్ని తప్పులైనా చేసుకోండి అని అనట్లేదు, ఇది బాప్థిసం కాన్సెప్ట్ కాదు).మతం మారటానికి అవి వేరే మతాలూ కాదు!!మతంగా పిలవబడుతున్న హిందూ అనే సనాతనధర్మంలోని మత భాగాలు.

భాగవతంశాలు మతంగా పిలువబడుతున్న సనాతన హిందూధర్మం లోని మత వివరణ తరువాత వివరించటం జరుగుతుంది.

వివరించబోవు అంశాలు ఇవి.
1. అద్వైతం
2. ద్వైతం
3. విశిష్టాద్వైతం
4. శాక్తేయం
5. వైష్ణవం
6. శైవం
ఓం నమః శివాయ.