Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 15 May 2013

VELAGA FRUIT AND ITS NATURAL HEALTHY USES TO HUMANS


వెలగకాయ పచ్చిది కొంచెం వగరుగా ఉంటుంది. వాతం కలుగుతుంది. మలబద్దకం కలుగుతుంది. కాని తేలిగ్గా అరుగుతుంది. వెలగపండు కొంచెం ఆలస్యంగా అరిగినా బాగా చలవచేస్తుంది. దప్పికనీ, ఎక్కిళ్లనీ, వాతాన్ని పోగొ డుతుంది. కొంచెం పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండే వెలగపండులో కమ్మని రుచి, చక్కని సుగంధం, విలువైన ఔషధగుణాలు ఉన్నాయి.  పచ్చికాయని నేరుగా తీసుకుంటే గొంతు పూడుకుపోయినట్లయి, పట్టినట్లుంటుంది. పచ్చి వెలక్కాయ గొంతుకడ్డం పడ్డట్లు అనే సామెత వాస్తవమే. కాని, బాగా పండిన వెలగపండు గొంతుని శుద్ధి చేస్తుంది. కంఠరోగాలకు పథ్యం. గొంతులో పచ్చిపుళ్లు, పూత, టాన్సిల్స్‌ వాపులు న్నప్పుడు వెలగ పండు గుణాన్ని చూపుతుంది.
అప్పుడప్పుడూ వెలగపండును ఆహారపదార్థంగా తీసుకోవడం వలన శరీరంలో విషలక్షణాలు తగ్గుతాయి. మారేడు లానే వెలగ కూడా సమానంగా పనిచేస్తుంది. మారేడు, వెలగ గుజ్జుల్ని కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు, వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. మరమరాల పిండిలో కలిపి తీసుకుంటే మరీ మంచిది. వెలగపండు గుజ్జులో పిప్పళ్లని కలిపి తింటే వాంతి, వికారం, అజీర్తి, కడుపులో మంటలు తగ్గుతాయి.