కొంత మంది మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బం దిగా ఉంటుంది. దీనికి కారణం నోటి దుర్వాసన. అతి సాధారణమైన ఈ నోటి దుర్వాసనకు ఎన్నో కారణాలున్నాయి.
నోటి నుండి వచ్చే దుర్వాసనకు దంతాల చిగిళ్ళుపై ఏర్పడిన బాక్టీరియా విడుదల చేసే వాసన అసలు కారణం. వెల్లుల్లి, ఉల్లి తిన్నప్పుడు ఈ సమస్య మరింత జటిలం అవుతుంది.
పొగ తాగడం నోటి దుర్వాసనకు మరొక ముఖ్య కారణం దీనితో బాటు ముక్కు, ఉదర సంబంధిత భాగాల అనారోగ్యం కూడా ఒక్కోసారి ఈ సమస్యకు కారణం కావచ్చు.
పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోయిన ఆహర పదార్ధాలు పళ్ళ మీద గారపర్చడం నోటి దుర్వా సనకు దారి తీస్తాయి. దంతాలను రెండు పూటలా శుభ్రంగా బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వా సనను చాలా వరకు అరికట్టవచ్చు. అయితే మన దంతాలు చిగుళ్ళపై ఉండే బాక్టీరియా ఎన్నో రకాల చిగుళ్ళ వ్యాధులకు, దంతాలు పాడైపోవడానికి కారణమవుతున్నాయి.
నోరు దుర్వాసన ఉందనే విషయాన్ని ఎలా గమనించాలి. ఎన్నో చిన్నచిన్న సంకేతాల ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి పక్కకు తప్పు కోవడం వంటి అంశాల ద్వారా నోరు దుర్వాసన వస్తోందన్న విషయాన్ని గమనించాలి.
ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే చేతిమణికట్టు దగ్గర కొద్దిగా నాలుకతో తాకి అటు పిమ్మట అక్కడ వచ్చే వాసనను బట్టి నోటి దుర్వాసన చాలా తేలికగా తెలుసుకోవచ్చు. ఇంకా మనం విశ్వసించే మంచి మిత్రుల్ని అడిగి కూడా నోటి దుర్వాసన గురించి తెలుసుకోవచ్చు.
నోరు దుర్వాసన ఉన్న ప్రతి వారు ఎల్లప్పుడు నోటిని, దంతాలను పరిశుభ్రంగా తాజాగా ఉంచుకోవడం ప్రారంభించి అలవాటు చేసుకోవాలి. దంత వైద్యుడిని సంప్రదించడం వల్ల దంతాలకు పళ్ళను, చిగుళ్ళను ఏవిధంగా శుభ్రపర్చకోవాలి? నోటి లోపల ఏయే భాగాలను శుభ్రపర్చకుండా వదిలేస్తున్నాం? వీటితో పాటు నాలుకను కూడా ఏవిధంగా శుభ్రంగా ఉంచుకోవాలి? మొదలైన విషయాలు తెలుసుకోవచ్చు.
చిగుళ్ళ వ్యాధులు నోటి దుర్వాసన, నోరు అరుచి మొదలగు సంకేతాలు తరచుగా వస్తుంటే వెంటనే దంత వైద్యుడిని తప్పక సంప్రదించాలి తీసుకునే అహార వివరాలు మందులు వాడుతుంటే వివరాలు ఎప్పటికప్ఫడు డైరీలో రాసి వైద్యుడికి చూపించడం వల్ల మీ సమస్యలకు తగిన పరి ష్కారం సూచించగలుగుతారు.
ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టులను ఉపయోగించి రోజుకు రెండుసార్లు దంతాలను, చిగుళ్ళను శుభ్ర పరచుకోవడం, బ్రష్ చేసుకున్న ప్రతిసారి నాలు కను శుభ్రపరచుకోవడం మర్చి పోకూడదు.
కట్టుడు పళ్ళను వాడేవారు రాత్రి సమయంలో వాటిని నోటి నుండి తీసివేయాలి. దీని వల్ల నోటికి విశ్రాంతి లభిస్తుంది. కట్టుడు పళ్ళను టూత్‌పేస్టు లతో శుభ్రపర్చడం వల్ల దంతాలపై గీతలు లాంటివి పడి లాగినట్టుండి నొప్పులను కలుగ చేస్తాయి. అంతేకాక వాటి సహజ మెరుపును కూడా కోల్పోతాయి.
కట్టుడు పళ్ళను గోరువెచ్చటి సబ్బునీటిలో శుభ్రం చేయాలి. వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రీములను, బ్రష్‌నే వాడాలి. కృత్రిమ దంతాలు అమర్చిన చిగుళ్ళ అంగిరి భాగాలను కూడా శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడరు. ఇలా ఎల్లప్పుడూ కృత్రిమ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వాటిపై గారపట్టడం బాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు చేరకుండా జాగ్రత్త పడవచ్చు.
భోజనానంతరం పళ్ళ మధ్య ఆహారపు పదార్ధాలు ఇరుక్కుంటే భోజనం చేసిన తర్వాత ప్రతిసారి పళ్ళు తోముకోవాలి. చాలా వరకు మౌత్ వాష్‌లు నోటి దుర్వాసనను కొద్ది సమయం మాత్రమే తగ్గించగలవు.
కాబట్టి మౌత్ వాష్ వాడదల్చుకున్నపుడు దంత వైద్యుడి సలహా తీసుకుంటే బాక్టీరియాని నశించేలా చేసే క్లోరోహెకైడల్ మందు కలిగిన మౌత్ వాష్‌ను సూచిస్తాడు. చిగుళ్ళ వ్యాధులకు సంబంధించి ఎక్కువ కాలం వాడే కొన్ని మౌత్ వాష్‌ల వల్ల పళ్ళ గుంజినట్లు ఉండటం ఒక్కోసారి పళ్ళు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నోటి దుర్వాసనకు ఇతర కారణాలు
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నోటి దుర్వాస నకు కారణం కావచ్చు.
సాధారణంగా నోటినుండి లాలాజలం జారు తుంది. ఫలితంగా నోటిలో బాక్టీరియా తయా రయి నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. కొన్ని రకాల మందులు వాడటం వల్ల లాలాజలం గ్రంథి సమస్యల వల్ల లేదా ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా చాలా సేపు గాలి పీల్చుకోవడం వల్ల నోరు ఎండి పోవడం జరుగుతుంది.
వయసు పైబడిన వారికి లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవడం ఇతర అనారోగ్య కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఎక్కువ కాలం నుండి నోటి దుర్వాసనగల వారు దంతవైద్యుడ్ని సంప్ర దించడం తప్పనిసరి. నోరు ఆరోగ్యంగా ఉన్నప్పటికి దుర్వాసన కలిగి ఉంటే వైద్యపరీక్షలు నిర్వహించి అసలు కారణం తెలుసుకోవచ్చు.
నోటి దుర్వాసనకు మరొక ముఖ్యకారణం పొగతాగడం. దీనికి ఏకౖౖెక పరిష్కారం పొగతాగడం మానివేయడం పొగతాగడం వల్ల పళ్ళు గుంజినట్లు అనిపించడం నోరు రుచిలేక పోవడం చిగుళ్ళు బాధ పుట్టించడం జరుగుతుంది. ఎక్కువగా పొగతాగే వారు చిగుళ్ళు సమస్యలతో బాధపడటంతో పాటు నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులకు గురమ్యే ప్రమాదం ఎక్కువ.
నోరు దుర్వాసన కలిగి ఉన్న వ్యక్తికి ఆ విషయం ఎలా చెప్పాలి అవతలి వ్యక్తి బాధపడకుండా అతని సమస్యను అర్ధమయ్యే రీతిలో నిర్మొహమాటంగా వారితో ధైర్యంగా చర్చించగలగాలి ఇలాంటి సంద ర్భాల్లో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి.