గురుముఖముగా నేర్చుకున్న విద్య అత్యంత ఉత్తమమైనది. ఆ గురువ్ఞ కూడా శిష్యులను పుత్రులుగా భావించి, విద్యను నేర్పించవలెను. ఆయన తన శిష్యులను ఉత్తమమైన మార్గములో పెట్టుటకు సమర్ధుడుగా ఉండవలెను. ఆయన ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి. శిష్యుల ప్రవర్తనను ఎల్లవేళలా గమనించాలి. పూర్వం గురుకులంలో విద్య అభ్యసించేవారు కనుక ఇది సాధ్యపడేది. శిష్యులకు ఆచరించవలసిన పనులు, చెయ్యకూడని పనులు తెలియచెయ్యాలి.
వ్యక్తుల మనస్తత్వాలు గ్రహించాలి అని బోధించాలి.
గురువ్ఞ విద్యార్థుల అభిలాష మేరకు ఇతర కళలు కూడా అభివృద్ధి పరచాలి.
నిద్రించేటప్పుడు పరిసరాలు గమనించాలి. ఏదైనా అనుమానం కలిగినప్పుడు గురువ్ఞకు తెలియచెయ్యాలి అని చెప్పాలి.
తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగాలి. వారు అస్వస్థులయినప్పుడు సపర్యలు చెయ్యాలి అని చెప్పాలి.
కొందరు చెప్పిన విషయాన్ని త్వరగా గ్రహించగలరు. మరికొందరు ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. వారిని ఇతరుల వద్ద హేళన చెయ్యకూడదు. విద్యార్థులను ఆ విషయం గ్రహించేటట్లు చెయ్యాలి.
గొప్ప వ్యక్తుల గురించి తెలియచెయ్యాలి. తరు చుగా ప్రపంచంలో జరుగు విషయాలను గురించి అవగాహన కలిగించాలి.
గురువ్ఞకు విద్యార్థులతో రహస్యమైన జీవితం ఉండకూడదు. తరచుగా దేశభ్రమణం చెయ్యాలి.
గురువ్ఞకు విద్యార్థులతో రహస్యమైన జీవితం ఉండకూడదు. తరచుగా దేశభ్రమణం చెయ్యాలి.
భౌగోళిక విషయాలపై అవగాహన కలిగించాలి.
గురువ్ఞ సాందీపని గురు విద్యాలయం పూర్వం భారతదేశం అంతా సంచారం చేసింది. శ్రీకృష్ణ, బలరామ, కుచేలులు ఇందులో విద్య అభ్యసించారు.
గురువ్ఞ డాంబికాలు పలుకకూడదు. శిష్యులు గురువ్ఞ పాండిత్యాన్ని స్వయంగా తెలుసుకోవాలి. ఆయన స్వయంగా చెప్పకూడదు.
ఇతర గురుకులాల గురించి అక్కడి గురువ్ఞను గురించి. గురువ్ఞ ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండకూడదు, విద్యార్థులకు లేదా శిష్యులకు కలిగించకూడదు.
భేదభావం లేకుండా అందరిని సమానంగా చూడాలి. సమానంగా విద్యను అందించాలి. పక్షపాతం ఉండకూడదు. ఎంత గొప్పవాడయినా ద్రోణాచార్యుడు ''అర్జునపక్షపాతి అని పేరు పడ్డాడు. అది ఆయన జీవితానికి తీరని మచ్చ.
ధర్మాన్ని రక్షిస్తానని విద్యార్థులతో ప్రమాణం చేయించాలి. పూర్వం పై లక్షణాలన్నీ గురువ్ఞలు కలిగి ఉండేవారు. ''ధనాన్ని ఆశించారు అనే పేరు వారికి లేదు. ఎందుకంటే రాజులు, మహారాజులు ఆ విద్యాలయాలు పోషించేవారు. చిత్తశుద్ధితో గురువ్ఞలు శిష్యులు ఉండేవారు. నేటికాలంలో అటువంటివారు ఉన్నప్పటికి తక్కువగా ఉన్నారు. వారందరికి వందనములు.