
తెలుగు జాతి కి, తెలుగు పౌరుషానికి , తెలుగు వారికి మదరాసి లు అనే తెగులు తొలగించి , మనం సగర్వంగా తల ఎత్తుకునేట్టు, మన తెలుగు తల్లి కీర్తి ని ప్రపంచ ప్రక్యాతం చేసిన మెఱు మగాధీర్‌డు, తెలుగు తల్లి ముద్దు బిడ్డ ,తెలుగు తేజం, స్వర్గీయ నందమూరి తారక రామా రావు గారు...
తెలుగింటి ఆడపడుచులు అందరూ అన్న అంటూ ఆత్మీయంగా పిలుచుకున్న ఆ అన్నయ్య, పరమపాదించి నేటికి పదిహేను వసంతాలు అయినాయి..
తెలుగు వారు ఆరాధ్య దైవం గా కొలుచుకునే విశ్వ విఖ్యాత నట సర్వభౌమా, రాముడై, కృష్ణుడై, రావనుడై, భీముడు, కర్ణుడి గా, సర్దార్ పాపారాయుడుగా, అడవి రాముడు గా, ఇలా ఇలా లో ఎవరు చేయలేని , సాటిరాని అసమానా నటనా ప్రావీణ్యం తో, తెలుగు వారి మనసులని కొల్ల గొట్టి, పేద వాడికి పట్టెడు అన్నం పెట్టాలనే సదాశాయంతో , రాష్ట్రం దిశ దశ , లేక అవినీతి లో, అరాచకం లో కూరుకుపోయి, తెలుగు వారి ఆత్మ గౌరువాం ని డిల్లీ వీధులో, తాకట్టు పెడుతున్న సమయం లో , యుగ పురుషుడు వలె పార్టీ స్తాపించి మళ్లీ ఈ దేశం లో ఎవరి వల్లా కానీ విధంగా
చరిత్ర సృష్టించడం ఆయనకే చెందింది .. ఆయన ధనం, బలం, బలగం అంతా తెలుగు బాషె.. ఆయన నమ్ముకున్న తెలుగు బాష ఆయన్ని చరిత్ర పుటలలో శాశ్వతం గా నిలబెట్ట్తింది ఆయన్ని స్మరించుకుంటూ.. ఆయన లేని లోటు పూడ్చలేనిది.. జోహార్ రామా రావు
NANDAMURI THARAKA RAMA RAO OLD PICS