పుత్రుడు మకరధ్వజునితో ఉన్న శ్రీ దండి ఆంజనేయస్వామి దేవాలయం
గుజరాత్ రాష్ట్రం లో బేంట్ ద్వారకలోని ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయం కు తూర్పున అయిదు కిలోమీటర్ల దూరం లో శ్రీ దండి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .ఇక్కడ శ్రీ హనుమ తన కుమారుడైన మకరధ్వాజుని తో దర్శనమిస్తారు .ఇదీ దీని ప్రత్యేకత .తండ్రీ కొడుకుల చేతుల్లో యే ఆయుధాలు ఉండవు .వీరి మధ్యలో ఒక దుడ్డు కర్ర మాత్రమె ఉంటుంది .ఇద్దరు చాలా ఉత్సాహం గా ఆనంద మూర్తులుగా దర్శన మివ్వటం విశేషం .దండి (దుడ్డు కర్ర )ఉన్న స్వామి కనుక దండి ఆంజనేయ స్వామి అని పేరొచ్చింది .
అహి ,మహి రావణసంహార సమయం లో చంద్ర సేన అనే పాతాళలోక రాకుమారి ఆంజనేయుని వారి బారి పడ కుండా ఒక దేవాలయ గర్భ గృహం లో దాచి ఉంచుతుంది .ఆమె హనుమ పై మనసు పడుతుంది .ఆ కారణం గా ఒక ఔరస కుమారుడు మకర ధ్వజుడు జన్మిస్తాడు .తల్లీ కుమారుడు శ్రీ హనుమ దర్శనం చేస్తారు అప్పుడు ఆమె అతడు తన కుమారుడని తెలియ జేస్తుంది .అతడిని పాతాలోకానికి ప్రభువును చేయ మని కోరుతుంది .అలానే చేస్తాడు ఆంజనేయుడు
అహి మహి రావణుల కపటాలను తెలుసుకొనిశ్రీ రామ ,లక్ష్మణులు వారి ద్దరి బందిఖానాలో ఉన్నారని గ్రహించి చిత్ర సేన సహాయం తో వారిద్దరిని కుటిలోపాయం తోనే ఆంజనేయుడు చంపేస్తాడు .రామ సోదరులను భుజాలపై కేక్కిన్చుకొని యుద్ధ రంగానికి చేరుకొంటాడు హనుమ .ఇదీ హనుమ ,మకరధ్వజుల కధ
ఇక్కడే ఆంజనేయ స్వామి ఆయన కుమారుడు మకరధ్వజుడు మొదటి సారిగా ‘’శ్రీ రామ జయ రామ జయ జయ రామ ‘’అనే త్రయోదశాక్షరి జపిస్తూ కలుసు కొన్నారు .ఈ ఆలయం లో సమర్ధ రామ దాస స్వామి ఈ మంత్రాన్ని చెక్కించారు వారి కలయికకు జ్ఞాపక చిహ్నం గా .ఇప్పటికీ మనం చూడ వచ్చు ..ఇక్కడే ఇద్దరికీ ఒక ఆలయాన్నితూర్పుముఖం గా నిర్మించారు .కుడివైపు హనుమాన్ ఎడమ వైపు కుమారుడు మకర ధ్వజవిగ్రహాలు ఉంటాయి ..తండ్రి కంటే కొడుకు కొంచెం ఎత్తు గా ఉంటాడు .మకర ధ్వజుని కుడి చేయి పైకి ఎత్తి అభయ ముద్ర లో ఉంటుంది .ఎడమ చేయి చాతీ మీద ఉంచుకొని ‘’నా హృదయం లో నా తండ్రి హనుమ ఉండగా మీకేమీ చింత వద్దు ‘’అని చెబుతున్నట్లున్తుంది .ఎడమ పాదం పైకి ఎత్తి కాలి కింద రాక్షసుడిని తొక్కి చంపుతున్నట్లు ఉంటుంది .వాలం భూమి మీద ఆని ఉంది ఆ దుష్ట రాక్షసుడిని తాను సునాయాసం గా సంహరించాననే భావాన్ని ద్యోతకం చేస్తున్ది..
శ్రీ హనుమాన్ తొడల పైభాగం నుండి మాత్రమె దర్శన మిస్తూ కని పిస్తాడు .కుడి చేయి భుజం పైకి ఎత్తి ,తల వెనుకకు ఉంటుంది .ఎడమ చేయి ఛాతీపై ఉంటుంది .తోక కుడి భుజాన్ని దాటి శిరస్సు వెనుక పైన కని పిస్తుంది .హనుమ ముఖం లో కుమారుడు మకరధ్వజుడు రాక్షస సంహారం చేస్తుంటే పొందే అమితా నందం కని పిస్తుంది .తండ్రీ కుమారుల మధ్య పైనే చెప్పినట్లు గదకాని మరే ఆయుధము కాని ఉండదు .ఒక్క దుడ్డు కర్ర మాత్రమె ఉంటుంది .ఇద్దరు ఆనం దోత్సాహాలతో దర్శనమిస్తారు కనుక ,ఇద్దరి మధ్యా దుడ్డుకర్ర మాత్రమె ఉంది కనుక ఈ స్వామిని ‘’దండి హనుమాన్ ‘’అంటారు .
ఈ దేవాలయం ప్రత్యేకతలను గురించి తెలుసు కొందాం .తండ్రీ కొడుకు లైన హనుమాన్ ,మకరధ్వజుల దేవాలయం భారత దేశం లో ఇదొక్కటే ఉంది .ఇద్దరి చేతుల్లోను యే రకమైన యుద్దాయుధం లేకపోవటం రెండో ప్రత్యేకత .మకర ధ్వజుడు రాక్ష సంహారం చేస్తూ కని పించటం మూడో ప్రత్యేకత .నాల్గవ విశేషం –హనుమ తొడల పై భాగం నుండి దర్శనమివ్వటం. .అయిదవ విశేషం –ద్వారకాధీశుడైన శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీ రాముని అలంకారం లోపల్లకి లో ఊరేగింపు గా ప్రతి ఏడాది దసరా లలో ఆంజనేయ స్వామి సన్నిధికి రావటం ,శ్రీరాముని గా ఆయనకు దర్శనమివ్వటం విశేషం ..భారత దేశం లో ఎక్కడా శ్రీ కృష్ణుడు శ్రీ రాముని వేషం వేసినట్లు లేకపోవటం –ఇక్కడే ఆ ప్రత్యేకత కన్పిస్తుంది .ఆరవ విశేషం –ఇరవై నాలుగు గంటలూ మూడు వందల అరవైఅయిదు రోజుల్లో నిరంతర శ్రీ రామ నామ మంత్రోచ్చాటన జరుగుతూఉండటం . .
సంకట మోచన హనుమాన్
కస్టాలు బాధలు కోరికలు ఉన్న వారు హనుమ సన్నిధికి చేరి తమ వేదనలను నివేదిన్చుకొంటారు .ఇక్కడి పూజారి వారి చేతిలో వక్కపొడి పెట్టి పంపిస్తాడు .వారు దాన్ని ఇళ్లకు తీసుకొని వెళ్తారు .వారి బాధలు తగ్గి కోరికలు తీరిన తర్వాతా మళ్ళీ ఆ వక్క పొడిని భద్రం గా పవిత్రం గా తెచ్చి పూజారి గారికి అంద జేస్తారు .ప్రతి సంవత్సరం హనుమ భూమి కిందకు వెళ్ళి ధాన్యం కొలుస్తూ ఉంటాడని ఇక్కడి వారి నమ్మకం .అంతే కాక ఇక్కడి హనుమ అదృశ్యమై పోతే కలియుగం అంతమై పోయి ఆయన మరో కల్పం లో బ్రహ్మ దేవుడు అవుతాడని విశ్వ సుస్తారు
శ్రీ హనుజ్జయంతి ని మహా వైభవం గా ఇక్కడ నిర్వ హిస్తారు .గుజరాత్ ,మహా రాష్ట్ర ల నుంచి వేలాదిగా భక్త జనం వస్తారు .కార్య క్రమాలు ఏడు రోజుల పాటు నిర్వహించటం దండీ ఆంజనేయ దేవాలయం ప్రత్యేకత ..