Search This Blog

Chodavaramnet Followers

Sunday 30 March 2014

HOW TO PRAY/PERFORM PUJA ON UGADI FESTIVAL - STEP BY STEP PROCEDURE PERFORMING UGADI FESTIVAL IN TELUGU



ఉగాది‬ ఎలా జరుపుకోవాలి?

ఉగాది నాడు తెల్లవారుఝామునే (సూర్యోదయానికి గంటన్నర ముందు) నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్వచ్ఛమైన నువ్వుల నూనెను శరీరానికి, తలకు పట్టించుకుని, నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి.

స్నానం చేశాక కొత్త బట్టలు/కొత్త బట్టలు కొనే పరిస్థితులు లేకపోతే ఉతికిన బట్టలు, ఆభరణాలు ధరించాలి. కొత్తబట్టలు ధరించాక మీ ఇష్టదైవాన్ని(వినాయకుడు, శివుడు, కృష్ణుడు, రాముడు........ఇలా మీకు ఎవరంటె ఇష్టమో వారిని) పూజించాలి. పూజ చేయడం రాకపోతే ఒక స్తోత్రం చదవండి, అది రాకపోతే ఆ దేవుడి నామం/ పేరును చెప్పినా చాలు. భక్తితో ఒక్క నమస్కారం చేసినా చాలు, దేవుడు ఆనందిస్తాడు.

ప్రజలంతా ఉగాది రోజు తమ కుటుంబసభ్యులతో కలిసి వేపచెట్టుకు పసుపుకుంకుమ పూసి, దాని చుట్టు ప్రదక్షిణ చేసి దానినుండి వచ్చే ప్రాణవాయువును తృప్తిగా, దీర్ఘంగా పీలుస్తూ ఆ చెట్టునుండి వేప పువ్వును సేకరించుకుని ఇంటికి తెచ్చుకోవాలి. వేపగాలి పీల్చడం వలన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదదు మొదలైన ప్రధాన భాగాలు చైతన్యవంతమై వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

వేప పచ్చడి/ఉగాది పచ్చడిని పరకడుపున (అంటే ఖాళీ కడుపున) ఉదయం 8 గంటలలోపు సేవిస్తేనే దాని ఔషధ గుణాలు శరీరాన్ని రోగరహితం చేస్తాయని ఆయూర్వేద గ్రంధాలు చెప్తున్నాయి.

సాయంత్రం స్థానిక దేవాలయంలో కానీ, లేక ఇతర పవిత్ర ప్రదేశంలో కానీ పంచాంగశ్రవణం చేయాలి. శ్రవణం అంటే వినడం అని అర్దం. కొత్త ఏడాదిలో దేశం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏలాంటి ఫలితాలుంటాయి, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి...... మొదలైఅనవన్నీ పంచాంగశ్రవణం లో చెప్తారు. పంచాంగశ్రవణం చేయడం వల్లనే అనేక దోషాలు తొలగిపోతాయి. గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది.

దేవాలయంలో కానీ, సాంస్కృతిక కూడలిలో కానీ పంచాంగ శ్రవణం చేయాలి. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే 5 ని "పంచ అంగములు" అంటారు. వీటిని వివరించేదే పంచాంగం. పంచాంగం ఉత్తరముఖంగా కూర్చుని వినాలని శాస్త్రం.

పంచాంగశ్రవణంలో సంవత్సర ఫలితాలు, సంక్రాంతి పురుషుడు, నవనాయకులువంటి వారితో పాటు వివిధ రాశులవారి ఆదాయ, వ్యయాలు, రాశిఫలాలు చెప్తారు. పంచాంగ శ్రవణంలో నవగ్రహాలను స్మరించడం వలన చాలా రకాలుగా సత్ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది.

పంచాంగ శ్రవణం ఫలితంగా సూర్యుడివల్ల శౌర్యం, చంద్రుని వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వ మంగళాలు, బుధుడివలన బుద్ధి వికాసం, గురువు వలన జ్ఞానం, శుక్రుడి వలన సుఖం, శని వలన దుఖఃరాహ్యితం, రాహువు వలన ప్రాబల్యం, కేతువు వలన ప్రాధాన్యత లభిస్తాయి.

HAVE A HAPPY BALANCED UGADI FESTIVAL





UGADI FESTIVAL TELUGU MUGGULU







LORD GANESHA BLESSINGS TO ALL ON HAPPY UGADI FESTIVAL


WISHING YOU ALL A HAPPY UGADI FESTIVAL ON 31-03-2014


UGADI FESTIVAL LATEST SAREES AND SALWARS COLLECTION





HAPPY REAL UGADI FESTIVAL


VEPA CARTOONS



WHAT IS UGADI FESTIVAL - THE MEANING AND IMPORTANCE OF UGADI FESTIVAL


CASH VOTE


OLD IS GOLD


HAPPY HAPPY UGADI FESTIVAL




UGADI FESTIVAL SPECIAL CARTOONS




THE IMPORTANCE OF TELUGU FESTIVAL - UGADI


ఉగాది ప్రాముఖ్యత :

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ."ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

"తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:"

చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు. సంప్రదాయాలు: ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం. మున్నగు ‘పంచకృత్య నిర్వహణ‘ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ‘తో మొదలుపెట్టి ‘అక్షయ‘నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి‘ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

HAPPY UGADI FESTIVAL 31-03-2014


ఉగాది పచ్చడి 

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా:-

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
మిరపపొడి - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు .

SRI BRAHMASRI CHAGANTI KOTESWARA RAO GARI SRI JAYA NAMA UGADI FESTIVAL ANNUAL HIGHLIGHTS


thanks to
Sri Brahmasri Chaganti Koteswara Rao గారి 

శ్రీ జయ నామ సంవత్సర విశేషాలు

భగవంతుడు కాలస్వరూపుడు. అన్నీ ఋతువులు, కాలాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. సృష్టిలోని జీవనవ్యవస్థకు మూలం భగవంతుడే. 6 ఋతువులు, 12 మాసాలు, 365 రోజులు... ఇవన్నీ కాలస్వరూపుని విభాగాలే. ఈ 12 మాసాలలో తొలిమాసం చైత్రం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని పురాణోక్తి. కలియుగ ప్రమాణము 4లక్షల 32వేల సంవత్సరములు. శ్వేతవరాహకల్పము నందలి 7వ దైనటువంటి వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగము నందలి కలియుగ ప్రధమ పాదములో 5115 వదియు, ప్రభవాది 60 సంవత్సరాలలో 28వ దైనటువంటి ఈ సంవత్సరమును చాంద్రమానంచే శ్రీ 'జయ' నామ సంవత్సరముగా పేర్కొందురు.

ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా లెక్కించినచో, ప్రభవాది అరవై సంవత్సరాలను పన్నెండు యుగాలుగా భావించాలి. ప్రతి యుగములోని ఐదు సంవత్సరాలను వరుసగా సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరములని పిలువబడును. ఈ పరంపరలో ఆరవ యుగములోని 'ఇదావత్సర' మను నామంతో ఉన్న మూడవ సంవత్సరమే శ్రీ జయ నామ సంవత్సరం.
పూషణం జయ నామాణమ్ జయదం భక్త సన్తతే ।
శంఖ చంక్రాంకిత కరద్వందం హృదిసమాశ్రయే ॥

ద్వాదశాదిత్యులలో 11 వ ఆదిత్యుడైన అయిన పూషుడు మాఘ మాసానికి అదిదేవత. ఈ పూష దేవత ప్రజలందరికీ జయమును చేకూర్చుటకు, ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును కలిగి 'జయ' అనే నామధేయము కలిగిన శ్రీ సూర్య నారాయణుడైన... శ్రీమహా విష్ణువు అధిపతిగా ఉన్న సంవత్సరమే శ్రీ జయ. మాఘమాసానికి అధిపతిగా ఉన్న సూర్యునిపేరే పూష. ద్వాదశాదిత్యులలో 11వ దేవతా స్వరూపం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో మాఘమాస ఆది అంత్యాలు శ్రవణా నక్షత్రంలోనే రావటం, ఈ శ్రవణం కలియుగ మహా విష్ణువైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కావటం, శ్రవణా నక్షత్రానికి అధిపతైన చంద్రుడే శ్రీ జయ సంవత్సరానికి రాజు మంత్రి కావటం విశేషం. మాఘమాస శుక్ల ఏకాదశి '"జయ ఏకాదశి" చంద్రుని మరో నక్షత్రమైన రోహిణిలోనే రావటం మరో విశేషం.

355 రోజులు సాగే శ్రీ జయ సంవత్సరానికి రాజ్యాధిపతి, మంత్రిత్వం చంద్రుడికి, సేన అర్ఘ మేఘాదిపత్యములు రవికి, సస్య నీరసాదిపత్యములు బుధునికి, ధాన్యాధిపత్యము కుజునికి, రసాధిపత్యము శుక్రునికి లభించగా గురు, శనులకు ఏ ఒక్క ఆధిపత్యం లభించలేదు.

రాజు, మంత్రి ఒకరే అయినందున నిర్ణయాలు తీసుకొనుటలోను, ఆచరణలోను సమస్యలు ఉండవు. మధ్య మధ్యలో ప్రజలకు వచ్చే కష్టాలు వినటానికి రాజైన చంద్రుడు ఒక్కోసారి అందుబాటులో ఉండకపోవటం శ్రీ జయలో జరుగుతుంది. అందుకే 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు, ప్రతినెలా అమావాస్య మరియు దాని ముందు వెనుక రోజులలో ప్రజలు ఎదుటివ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తమ స్వ విషయాలను ఎదుటివారికి బహిర్గతం చేయవద్దు. గోప్యంగా ఉంచాలి.
రాజైన చంద్రునకు అక్టోబర్ 8న పాక్షిక చంద్రగ్రహణం జరిగినందున, రాజు మంత్రి చంద్రుడే అయినప్పటికీ, అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చే వారు కూడా ఉంటుంటారు. అంచేత ప్రజలకు కొన్ని సందర్భాలలో తిప్పలు తప్పవు. కనుక వ్యావహారికంగా తెలుగునాట పాలించే నాయకులకు కూడా తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చేవారు ఉంటుంటారు. కనుక విజ్ఞతతో ఆలోచిస్తూ పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని పాలకులు గమనించాలి.

2014 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రక్షణశాఖ అధిపతులు అత్యుత్సాహం చూపకూడదు. జూన్ జూలై ఆగష్టు నెలలలో రక్షణశాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రక్క రాష్ట్రాల నేతలతో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగిననూ ఫలితాలు అసంపూర్ణం. ఉగ్రవాద దుశ్చర్యలను చేపట్టేవారు అధికము. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ విజయపంథాలో దూసుకువెల్లును. ఎలక్ట్రానిక్ వస్తువులు సరసమైన ధరలలో అందుబాటులోకి వచ్చును. టెలి కమ్యునికేషన్ రంగాలు బలపడును. క్రీడా రంగంలో కుంభకోణాలు బయటపడును. పర్యాటకరంగం అభివృద్ధి చెందును.

నిరుద్యోగులకు తీపివార్తలు. సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులుండును. చేతి వృత్తులు, చిన్న పరిశ్రమలకు సహాయ సహకారాలుండును. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ప్రాధమికంగా ప్రయోజనలుండును. గృహనిర్మాణ రంగం అభివృద్ధి. స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, కర్షక రంగాలలో అభివృద్ధి గతం కంటే మెరుగగును. సరిహద్దు సమస్యలచే తరచూ ఇబ్బందులు. గ్యాస్, విద్యుత్ సరఫరాలలో సంక్షోభం. విదేశీ మారకం విలువ పెరుగును.

జూలై 13 నుంచి సెప్టెంబరు 4 వరకు శని కుజులు తులారాశిలో కలయికచే వాతావరణం అనుకూలం కాదు. సెప్టెంబరు 25 నుంచి నవంబరు 12 వరకు సినీరంగానికి, కంప్యూటర్, సాఫ్ట్ వేర్ రంగములకు గడ్డురోజులు. సంగీత, సాహిత్య, కళారంగాలలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండును.
నవమేఘ నిర్ణయానుసారం వాయు నామ మేఘం వాయువ్య భాగంలో ఏర్పడును. ఇందుచే అధిక గాలులచే భారీ వర్షములు, జల ప్రమాదములు ఉత్పన్నమగును. 7 భాగాలు సముద్రమునందు, 9 భాగాలు పర్వతములయందు, 4 భాగాలు భూమియందు వర్షములు పడును. నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, వాయుగుండాలు అధికంగా ఉన్నందున భారీ వర్షములు అధికము. మేఘాధిపతి రవి కావటంచే అక్టోబర్, నవంబర్ లలో భారీ వర్షాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు ఎంతో అవసరం. సెప్టెంబరు 17 కన్యాసంక్రాంతి వచ్చిన 7వ రోజే మహాలయ అమావాస్య రావటం, అక్టోబరు 17 తులాసంక్రాంతి వచ్చిన 7వ రోజే దీపావళి అమావాస్య రావటంచే జల సంబంధ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ వచ్చుటకు అవకాశములున్నాయి.

ధాన్యాధిపతి కుజుడైనందున ఎరుపు ధాన్యాలు, ఎరుపు నెలలు పుష్కలంగా పండుతాయి. కాని 2014 జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలు ఎరుపు పంటలకు అనుకూలం కానందున రైతాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ఘాధిపతి రవి అయిన కారణంగా వాణిజ్యం తరచూ మార్పులుంటూ, షేర్ విలువలు మోసపూరితంగా ఉండు సూచన కలదు. అక్టోబర్, నవంబరు మాసాలలో వాణిజ్య రంగానికి అనేక ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. అప్రమత్తతతో వ్యవహరించాలి.

అక్టోబరు 16 నుంచి నవంబరు 16 వరకు మధ్యగల కాలంలో రక్షణశాఖ పనితీరు సమర్ధవంతంగాను, సమయాస్పుర్తితోను ఉండాలి. అక్టోబరు 17 నుంచి నవంబరు 27 వరకు కుజ, గురులు షష్టాష్టక స్థితులలో ఉండటము, నవంబరు 28 నుంచి 2015 జనవరి 4 వరకు ఉచ్చస్థితిలో కుజుడు, ఉచ్చస్థితిలో గురువు పరస్పర వీక్షణలతో ఉండి, కుజునిపై శనివీక్షణ కూడా ఉన్నందున ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో దుష్టశక్తులు దుష్ట పన్నాగాలు చేయు సూచన.

జయ జ్యేష్ట బహుళ సప్తమి గురువారం 19 జూన్ 2014 ఉదయం 8.47 గం॥ గురువు కర్కాటకరాశి ప్రవేశించే సార్ధ త్రికోటి తీర్థ సహిత యమునా నదికి పుష్కరాలు ప్రారంభమై జూన్ 30తో ముగియును. పుష్కర రాజైన గురువు ఉచ్చ ప్రవేశం రోజే గురువారం కావటం పైగా గురు నక్షత్రమైన పూర్వాభాద్ర సప్తమి తిదితో ఉండటం అరుదుగా వచ్చే విశేషం. ప్రయాగ, ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం స్నానయోగ్య పుణ్య క్షేత్రాలు. ధృవ, కంసఘాతికా, విశ్రమ ఘట్టములు మధురలో నున్నవి. బృందావనంలో 32 పుణ్య తీర్ధ ఘట్టాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం పవిత్ర పుణ్యప్రదం.

2015 జనవరి 15 మకర సంక్రాంతి పర్వదినాన మకర సంక్రాంతి పుణ్య పురుషుడు మందాకినీ నామంతో, గజ వాహనంపై స్వాతి నక్షత్రంలో గురువారం రోజున రావటం మహా విశేష శుభప్రదం.

ఈ సంవత్సర ఆదాయం 93 కాగా, సంవత్సర వ్యయం 84 భాగాలు. ఇక ద్వాదశ రాశులకు ఆదాయ, వ్యయ, రాజ్యపూజ్య, అవమానాలను లెక్కిస్తే ....
మేషరాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 5 అవమానం
వృషభరాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం
మిధునరాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 1 అవమానం
కర్కాటకరాశి వారికి 5 ఆదాయం, 8 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 1 అవమానం
సింహరాశి వారికి 8 ఆదాయం, 2 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 4 అవమానం
కన్యారాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 5 రాజ్యపూజ్యం, 4 అవమానం
తులారాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజ్యపూజ్యం, 7 అవమానం
వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 7 అవమానం
ధనస్సురాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 7 అవమానం
మకరరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 3 అవమానం
కుంభరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 3 అవమానం
మీనరాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 6 అవమానం

మొత్తం మీద 2014-2015 జయ నామ సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తే 68 శాతం ప్రజలందరూ సుఖ శాంతులతో ఉంటారు. మిగిలిన 32 శాతం ప్రజలు సుఖ శాంతులు ఉండే సూచనలు ఉన్నప్పటికీ, అనుభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక శ్రీ జయ సంవత్సరానికి దేవతా స్వరూపం శ్రీ మహా విష్ణువు కనుక ప్రతి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక నామాలను లేక భావాన్ని అర్ధవంతంగా తెలుసుకుంటే తప్పక శుభం కలుగుతుంది.

WISH YOU ALL A HAPPY AND PROSPEROUS UGADI FESTIVAL ON 31-03-2014


god's prayer