Saturday, 8 November 2014

ESSAY ON POOR FAMILY



బాగా ధనవంతుడైన ఒ సినిమా స్టార్ కొడుకుని స్కూల్లో
''బీద కుటుంబం'' అనే విషయం మీద
వ్యాసం రాయమన్నారు.
ఆ కుర్రాడు ఇలా మొదలు పెట్టాడు.
''అనగనగా.....ఒక బీద కుటుంబం. ఆ
కుటుంబంలో తండ్రి చాలా బీదవాడు. తల్లి కూడా
ఎంతో పేదది, పిల్లలు కూడా అంతే.....
వాళ్ళ కారు డ్రైవరు...వాళ్ళ తోట మాలి, వంటమనిషి
పాపం అంతా పేదవారే.
చివరకు వాళ్ళ ఇంట్లో పనిచేసే నౌఖరు కూడా పేదవాడే.
ఒక రోజున వాళ్ళు పాపం.... తినడానికి తిండిలేక కారులో
బయలుదేరారు.....''