Tuesday, 26 February 2013

BEAUTY WITH FRUITS - BEAUTY TIPS FOR WOMEN


పండ్లతో అందం


పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలుసు. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా పండు చేసే మేలు చాలాఉంది. అదేలాగంటే...

ఠి ఒక టేబుల్‌స్పూను బొప్పాయిపండు గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి పట్టించి పావుగంటతర్వాత గోరువెచ్చటినీటితో కడుక్కుంటే చర్మం తేమగా ఉంటుంది. వారానికి రెండుమూడుసార్లు బొప్పాయిప్యాక్ వేసుకుంటే మెటిమలువంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఠి అరటిపండుగుజ్జులో కొద్దిగా శెనగపిండి కలిపి చేతులకు పట్టించి మసాజ్ చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే అరటిపండులో పుల్లటి పెరుగుకలిపి ప్యాక్ వేసుకున్నా టాన్‌పోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.