Search This Blog

Chodavaramnet Followers

Wednesday 30 January 2013

PLEAZE TICKET TELUGU ZOKE


PLEAZE TICKET TELUGU ZOKE

SPECIAL PULIHORA RECIPE WITH GREEN LEAVES -ESPECIALLY FOR FESTIVALS


SPECIAL PULIHORA RECIPE WITH GREEN LEAVES -ESPECIALLY FOR FESTIVALS

DOCTOR KANGARAPPA


DOCTOR KANGARAPPA

LORD ANJANEYA SWARMY TEMPLE AT GUJARAT - BENT DWARAKA - SRI DHANDI ANJANEYA SWAMI TEMPLE



పుత్రుడు మకరధ్వజునితో ఉన్న శ్రీ దండి ఆంజనేయస్వామి దేవాలయం
  గుజరాత్ రాష్ట్రం లో బేంట్ ద్వారకలోని ప్రసిద్ధ  శ్రీ కృష్ణ దేవాలయం కు తూర్పున అయిదు కిలోమీటర్ల దూరం లో శ్రీ దండి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .ఇక్కడ శ్రీ హనుమ తన కుమారుడైన మకరధ్వాజుని తో దర్శనమిస్తారు .ఇదీ దీని ప్రత్యేకత .తండ్రీ కొడుకుల చేతుల్లో యే ఆయుధాలు ఉండవు .వీరి మధ్యలో ఒక దుడ్డు కర్ర మాత్రమె ఉంటుంది .ఇద్దరు చాలా ఉత్సాహం గా ఆనంద మూర్తులుగా దర్శన మివ్వటం విశేషం .దండి (దుడ్డు కర్ర )ఉన్న స్వామి కనుక దండి ఆంజనేయ స్వామి అని పేరొచ్చింది .
           అహి ,మహి రావణసంహార సమయం లో చంద్ర సేన అనే పాతాళలోక రాకుమారి ఆంజనేయుని వారి బారి పడ కుండా ఒక దేవాలయ గర్భ గృహం లో దాచి ఉంచుతుంది .ఆమె హనుమ పై మనసు పడుతుంది .ఆ కారణం గా ఒక ఔరస  కుమారుడు మకర ధ్వజుడు జన్మిస్తాడు .తల్లీ కుమారుడు శ్రీ హనుమ దర్శనం చేస్తారు అప్పుడు ఆమె అతడు తన కుమారుడని తెలియ జేస్తుంది .అతడిని పాతాలోకానికి ప్రభువును చేయ మని  కోరుతుంది .అలానే చేస్తాడు ఆంజనేయుడు
అహి మహి రావణుల కపటాలను తెలుసుకొనిశ్రీ రామ ,లక్ష్మణులు వారి ద్దరి బందిఖానాలో ఉన్నారని గ్రహించి చిత్ర సేన సహాయం తో  వారిద్దరిని కుటిలోపాయం తోనే  ఆంజనేయుడు చంపేస్తాడు .రామ సోదరులను భుజాలపై కేక్కిన్చుకొని యుద్ధ రంగానికి చేరుకొంటాడు హనుమ .ఇదీ హనుమ ,మకరధ్వజుల కధ
BetDwarakaHanuMakar

  ఇక్కడే ఆంజనేయ స్వామి ఆయన కుమారుడు మకరధ్వజుడు మొదటి సారిగా ‘’శ్రీ రామ జయ రామ జయ జయ రామ ‘’అనే త్రయోదశాక్షరి జపిస్తూ కలుసు కొన్నారు .ఈ ఆలయం లో సమర్ధ రామ దాస స్వామి ఈ మంత్రాన్ని చెక్కించారు వారి కలయికకు జ్ఞాపక చిహ్నం గా .ఇప్పటికీ మనం చూడ వచ్చు ..ఇక్కడే ఇద్దరికీ ఒక ఆలయాన్నితూర్పుముఖం గా నిర్మించారు .కుడివైపు హనుమాన్ ఎడమ వైపు కుమారుడు మకర ధ్వజవిగ్రహాలు ఉంటాయి ..తండ్రి కంటే కొడుకు కొంచెం ఎత్తు గా ఉంటాడు .మకర ధ్వజుని కుడి చేయి పైకి ఎత్తి అభయ ముద్ర లో ఉంటుంది .ఎడమ చేయి చాతీ మీద ఉంచుకొని  ‘’నా హృదయం లో నా తండ్రి హనుమ ఉండగా మీకేమీ చింత వద్దు ‘’అని చెబుతున్నట్లున్తుంది .ఎడమ పాదం పైకి ఎత్తి కాలి కింద రాక్షసుడిని తొక్కి చంపుతున్నట్లు ఉంటుంది .వాలం భూమి మీద ఆని ఉంది ఆ దుష్ట రాక్షసుడిని తాను సునాయాసం గా సంహరించాననే భావాన్ని ద్యోతకం చేస్తున్ది..

BetDwarakaDandiTempl

 శ్రీ హనుమాన్ తొడల పైభాగం నుండి మాత్రమె దర్శన మిస్తూ కని పిస్తాడు .కుడి చేయి భుజం పైకి ఎత్తి ,తల వెనుకకు ఉంటుంది .ఎడమ చేయి ఛాతీపై ఉంటుంది .తోక కుడి భుజాన్ని దాటి  శిరస్సు వెనుక పైన కని పిస్తుంది .హనుమ ముఖం లో కుమారుడు మకరధ్వజుడు రాక్షస సంహారం చేస్తుంటే పొందే అమితా నందం కని పిస్తుంది .తండ్రీ కుమారుల మధ్య పైనే చెప్పినట్లు గదకాని మరే ఆయుధము  కాని  ఉండదు .ఒక్క దుడ్డు కర్ర మాత్రమె ఉంటుంది .ఇద్దరు ఆనం దోత్సాహాలతో దర్శనమిస్తారు కనుక ,ఇద్దరి మధ్యా దుడ్డుకర్ర మాత్రమె ఉంది కనుక ఈ స్వామిని ‘’దండి హనుమాన్ ‘’అంటారు .

BetDwarakaDandiTemple

ఈ దేవాలయం ప్రత్యేకతలను గురించి తెలుసు కొందాం .తండ్రీ కొడుకు లైన హనుమాన్ ,మకరధ్వజుల దేవాలయం భారత దేశం లో ఇదొక్కటే ఉంది .ఇద్దరి చేతుల్లోను యే రకమైన యుద్దాయుధం లేకపోవటం రెండో ప్రత్యేకత .మకర ధ్వజుడు  రాక్ష సంహారం చేస్తూ కని పించటం మూడో ప్రత్యేకత .నాల్గవ విశేషం –హనుమ తొడల పై భాగం నుండి దర్శనమివ్వటం. .అయిదవ విశేషం –ద్వారకాధీశుడైన శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీ రాముని  అలంకారం లోపల్లకి లో ఊరేగింపు గా ప్రతి ఏడాది దసరా లలో ఆంజనేయ స్వామి సన్నిధికి రావటం ,శ్రీరాముని గా ఆయనకు దర్శనమివ్వటం విశేషం ..భారత దేశం లో ఎక్కడా శ్రీ కృష్ణుడు శ్రీ రాముని వేషం వేసినట్లు లేకపోవటం –ఇక్కడే ఆ ప్రత్యేకత కన్పిస్తుంది .ఆరవ విశేషం –ఇరవై నాలుగు గంటలూ మూడు వందల అరవైఅయిదు  రోజుల్లో నిరంతర శ్రీ రామ నామ మంత్రోచ్చాటన జరుగుతూఉండటం . .
  సంకట మోచన హనుమాన్
          కస్టాలు బాధలు కోరికలు ఉన్న వారు హనుమ సన్నిధికి చేరి తమ వేదనలను నివేదిన్చుకొంటారు .ఇక్కడి పూజారి వారి చేతిలో వక్కపొడి పెట్టి పంపిస్తాడు .వారు దాన్ని ఇళ్లకు తీసుకొని వెళ్తారు .వారి బాధలు తగ్గి కోరికలు తీరిన తర్వాతా మళ్ళీ ఆ వక్క పొడిని భద్రం గా పవిత్రం గా తెచ్చి పూజారి గారికి అంద జేస్తారు .ప్రతి సంవత్సరం హనుమ భూమి కిందకు వెళ్ళి ధాన్యం కొలుస్తూ ఉంటాడని ఇక్కడి వారి నమ్మకం .అంతే కాక ఇక్కడి హనుమ అదృశ్యమై పోతే కలియుగం అంతమై పోయి ఆయన మరో కల్పం లో బ్రహ్మ దేవుడు అవుతాడని విశ్వ సుస్తారు
             శ్రీ హనుజ్జయంతి ని మహా వైభవం గా ఇక్కడ నిర్వ హిస్తారు .గుజరాత్ ,మహా రాష్ట్ర ల నుంచి వేలాదిగా భక్త జనం వస్తారు .కార్య క్రమాలు ఏడు రోజుల పాటు నిర్వహించటం దండీ ఆంజనేయ దేవాలయం ప్రత్యేకత ..

SPECIAL BRINJAL GREEN LEAVES TELUGU CURRY



CLEANLINESS TELUGU JOKE


CLEANLINESS TELUGU JOKE



HOSPITAL NAMED DAHAM TELUGU JOKE


HOSPITAL NAMED DAHAM TELUGU JOKE

SOME KITCHEN TIPS FOR HOUSE WIFE'S



వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో ఒక స్పూను పాలు పొయ్యాలి.
ఇంగువ నిల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.
నూనె పొరపాటున ఒలికిపోతే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనె త్వరగా పీల్చుకుంటుంది.
పసుపు నీళ్లతో కిచెన్‌ను శుభ్రం చేస్తే ఈగలు రావు.
కత్తిపీటకు ఉప్పు రాస్తే పదునుగా తయారవుతుంది.
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే పై పెంకు త్వరగా వస్తుంది
బిస్కెట్‌ ప్యాకెట్‌ను బియ్యం డబ్బాలో పెడితే బిస్కెట్లు తొందరగా మెత్తబడవు.
క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వెయ్యాలి.

MOM - MUMMY - AMMA - TELUGU POETRY


జీవిత వైకుంఠపాళిలో
పాములు బుస కొట్టినప్పుడు
అమ్మ జాగ్రత్తలే రక్షిస్తాయి!
నిచ్చెనలెక్కేప్పుడు..
అమ్మ ఆశలు ఫలించాయనిపిస్తాయి!
జీవిత చదరంగంలో
సైనికబలం తగ్గిపోతున్నప్పుడు
అమ్మ సలహాలే అండవుతాయి!
జీవిత గమనంలో
ప్రత్యర్థులు చొరబడినప్పుడు
అమ్మ ఆశీస్సులు ధైర్యాన్నిస్తాయి!
జీవిత పద్మవ్యూహంలో
చిక్కుకుని బయటపడలేనప్పుడు
అమ్మ నేర్పిన అభ్యాసాలే ఆదుకుంటాయి!
జీవిత పయనంలో
నిందల ప్రవాహమైనప్పుడు
అమ్మ పలుకులే ఆలంబనలవుతాయి!
జీవిత మార్గంలో
దారి తప్పి చీకట్లో చిక్కుకున్నప్పుడు
అమ్మ మాటలే వెలుతురవుతాయి!
జీవిత సాగరంలో
కష్టాల అలల్లో కొట్టుకుపోతున్నప్పుడు
అమ్మ చేతులే సేదదీరుస్తాయి
జీవిత లక్ష్యంలో
గమ్యం చేరుకోలేక విఫలమైనప్పుడు
అమ్మ ధైర్యవచనాలే ప్రోత్సాహాన్నిస్తాయి!
జీవిత గమ్యంలో
క్షణికావేశాలకు లోనవుతున్నప్పుడు
అమ్మ అనుభవాలే పందిరి అవుతాయి!
...
బతుకంతా తోడౌతుంది..
దారిచూపే అమ్మమాట!
జీవితం పొడుగూతా ఉంటుంది
సేదదీర్చే అమ్మనీడ!!

TELUGU SUKTHULU COLLECTION

  1. ఏ విషయమైనా కొత్తగా ఉన్నప్పుడే బాగుంటుంది.
    స్నేహం మాత్రం పాతబడినకొద్దీ బాగుంటుంది. 
    2.చదవడమంత చౌకగా లభించే వినోదమే లేదు.
    చదవడం వల్ల లభించే ఆనందం శాశ్వతమైనది
    3.మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితే
    అవే నిజమైన విజయాలు
    4.అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది

    5.చదరంగంలో మాదిరిగానే జీవితంలో కూడా
    ముందుచూపు ఎంతో అవసరం
    6.మానవుడు సృష్టించిన అద్భుతాలలో పుస్తకాలు మహత్తరమైనవి 
    7.ఏదైనా దురలవాటును వీలైనంత త్వరగా వదిలించుకోకపోతే అది అవసరంగా మారుతుంది
    8.అజ్ఞానం ఎప్పుడూ మార్పుకు భయపడుతుంది 
     





A KING AND A KUKOO - CHILD STORY

A KING AND A KUKOO - CHILD COMICS STORY IN TELUGU



పూర్వం మాధవ వర్మ అనే రాజు వుండేవాడు. అతని కోట అడవికి దగ్గర్లోనే ఉండేది. ఓ రోజు మాధవ వర్మ కిటికీ పక్కన కూర్చుని ఓ పుస్తకం చదువుతున్నాడు. అప్పుడాయనకు మధురంగా ఓ కోకిల పాట వినిపించింది.
'ఆహా... ఎంత తియ్యటి పాట! ఎంత అందంగా పాడుతుందీ కోకిల. దాన్ని వెంటనే తీసుకురమ్మని చెప్పాలి' అనుకున్నాడు మాధవ వర్మ.
''మధురంగా పాడుతున్న ఆ కోకిల ఎక్కడున్నా వెంటనే పట్టుకురండి'' అని భటులను ఆజ్ఞాపించాడు.
వెంటనే రాజభటులు వెళ్లి పాడుతున్న కోకిల కోసం అడవంతా గాలించారు. సాయంత్రానికి సెలయేటి ఒడ్డున ఓ మామిడి చెట్టుమీద కూర్చుని పాడుతున్న కోకిల వారికి కనిపించింది.
భటులు వెంటనే కోకిల దగ్గరికి వెళ్లి ''దయచేసి మాతో వస్తావా? నువ్వు రాకుంటే మా రాజుగారికి కోపం వస్తుంది'' అని దాన్ని అడిగారు.
వాళ్లతో వెళ్లడం కోకిలకి ఏ మాత్రం ఇష్టం లేదు. దానికి స్వేచ్ఛగా అడవిలో ఉండడమంటేనే ఇష్టం. అయితే రాజుని సంతోషపరచాలనుకుంది. అందుకే భటులతో పాటు కోటకి వెళ్లింది. మాధవవర్మకు రకరకాల పాటలు పాడి వినిపించింది. ఆ పాటలు విని ఆయన చాలా సంతోషించాడు. కోకిలను తనతోపాటు అక్కడే వుండిపొమ్మన్నాడు.
'సరే' అంది కోకిల.
దాని కోసం ఓ బంగారు పంజరం చేయించాడు మాధవవర్మ. అది పంజరంలోనే ఉంటూ రాజుకి ప్రతిరోజూ మంచి మంచి పాటలు వినిపించేది.
ఒకరోజు పొరుగు రాజు మాధవవర్మకు ఓ కానుక పంపించాడు. అది బొమ్మ కోకిల. దాని నిండా వజ్రవైఢూర్యాలు పొదిగారు. దానికి ఓ మీట ఉంది. దాన్ని తిప్పితే బొమ్మ కోకిల నుండి మధురమైన పాట వినపడుతుంది. ఇది చూసిన మాధవవర్మ చాలా సంతోషించాడు. మాటిమాటికీ దాని మీట తిప్పడం, పాట వినడం చేస్తున్నాడు.
ఈ బొమ్మ కోకిల ధ్యాసలో పడి నిజమైన కోకిలని మర్చిపోయాడు. దాంతో అడవి నుండి వచ్చిన కోకిల బాధపడింది. రాజు తనతో మాట్లాడతాడేమో, పాట పాడమని అడుగుతాడేమో అని ఎదురు చూడసాగింది. కానీ మాధవవర్మ దీని సంగతే పట్టించుకోవట్లేదు.
చూసీచూసీ కోకిలకి విసుగొచ్చేసింది. ఇక పారిపోదామని నిర్ణయించుకుంది. తనని పంజరంలోంచి విడిచి పెట్టమని అక్కడున్న ఒక భటుణ్ణి వేడుకుంది. ఆ భటుడు కోకిల స్థితికి బాధపడి పంజరం తలుపు తీశాడు. కోకిల అతనికి కృతజ్ఞతలు చెప్పి రివ్వున అడవిలోకి ఎగిరిపోయింది.
మాధవవర్మ మాత్రం బొమ్మ కోకిలను తన గదిలోనే పెట్టుకుని ఎప్పుడూ దాని పాటే వినేవాడు. అది కూడా బొమ్మ కదా... అలుపూ సొలుపూ లేకుండా, ఎప్పుడు మీట తిప్పితే అప్పుడు పాడుతూనే ఉండేది. ఓ సంవత్సరం గడిచేటప్పటికి బొమ్మ పాడయిపోయింది. మీట ఎంత తిప్పినా పాటలు పాడడం లేదు.
దాన్ని బాగుచేసే వాళ్లని పిలిపించమని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు కూడా ఆఘమేఘాల మీద బాగు చేసేవాళ్లకోసం పరుగులు పెట్టారు. బొమ్మల్ని బాగుచేసే వ్యక్తిని తీసుకొచ్చారు. అతను ఆ బొమ్మ కోకిలని ఎలాగో బాగు చేశాడు. కానీ ఎక్కువ రోజులు పని చేయదని, రోజూ వాడుతుంటే తొందరగా పాడైపోతుందని చెప్పాడు.
ఇది విని మాధవవర్మ చాలా బాధపడ్డాడు. జాగ్రత్తగా వాడుతూ, ఎప్పుడన్నా ఒకసారి దాని పాట వినసాగాడు. అయినప్పటికీ అది ఎక్కువ రోజులు పని చేయలేదు. కొన్ని రోజులు పాడి చివరికి పూర్తిగా పాడైపోయింది. కోకిల పాట వినకుండా మాధవవర్మ ఉండలేకపోయాడు. దిగులు పెట్టుకుని కొద్ది రోజులకే మంచం పట్టాడు.
రాజుగారిని ఆ స్థితిలో చూడలేక భటులు వెళ్లి అడవిలోని కోకిలని తెచ్చారు. అది కూడా మాధవవర్మ స్థితికి జాలిపడింది. వెంటనే మృదుమధురంగా ఆలపించసాగింది.
ఆ పాట విని మాధవవర్మ నెమ్మదిగా కళ్లు తెరిచి చూశాడు. ''మిత్రమా! మళ్లీ వచ్చావా? కొత్తగా వచ్చిన బొమ్మ కోకిలను చూసి మురిసిపోయాను. ప్రాణమున్న నిన్ను పట్టించుకోకుండా తప్పు చేశాను. ఇక ముందు అలా జరగదు. ఇక్కడే ఉండిపో'' అన్నాడు మాధవ వర్మ.
దానికి కోకిల నవ్వి ''రాజా! నేను పంజరంలో మాత్రం ఉండను. కానీ ప్రతి రోజూ వచ్చి పాట వినిపిస్తాను. అందుకు అంగీకారమైతే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు'' అంది.
రాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. మళ్లీ కోకిల పాటలతో పూర్తిగా కోలుకున్నాడు.

THE RELATIONSHIP BETWEEN AN AUNT AND DAUGHTER-IN-LAW IS A MOTHER AND A DAUGHTER - TIPS FOR NEWLY WEDDED BRIDES AND AUNTS - IN TELUGU



పెళ్లి జీవితంలో ఓ ముఖ్య ఘట్టం. పెళ్లికోసం ఆరాటపడని వారుండరు. మొదట్లో ఆకర్షణలు ముఖ్యభూమిక పోషించినా తర్వాత తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరికి ఎంతో అవసరమౌతారు. పెళ్లి చేసుకున్నవారు కొంతమంది విడిపోతుంటారు. ఇటీవలికాలంలో అయితే ఈ పెళ్లి బంధాన్ని సులువుగా తెంపేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు కొత్తకోడలు అత్తవారింట శారీరక మానసిక హింసలకు బలవుతూ బతకాల్సివచ్చేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చట్టపరంగా స్త్రీలకు రక్షణ వుంది. తమ హక్కులకు భంగం వాటిల్లుతుంటే నోరు మెదపకుండా కూర్చుని ఉండాల్సినవసరంలేదు. దిక్కులేని పరిస్థితుల్లో విడాకులకు వెళ్లాలి. ఇది ఆఖరి అస్త్రంగా వుండాలి.
మన వ్యవస్థలో తల్లిదండ్రుల వద్ద గారాబంగా పెరిగిన అమ్మాయి అకస్మాత్తుగా తల్లిదండ్రుల నీడనుండి అత్తమామల గూటికి బదిలీ అవుతుంది. ఆ కొత్తకోడలు జీవితకాలం అత్తవారింటిని స్వర్గంగా భావించి బతకాలి.
కొత్త కోడలు
అత్తవారింట్లో వారి అభిరుచులకు తగినట్లు మసలుకునేందుకు కొత్త కోడలికి కొంత సమయం పడుతుంది. ఆమె అన్నీ తెలిసిన ఆరిందలా మసలాలని అత్తవారు ఆశించకూడదు. గారాబంగా పెంచుకున్న కూతురిపై మమకారం మరువలేని తల్లిదండ్రులు తరచూ తమ బిడ్డను పుట్టింటికి పంపమని వియ్యాలవారిని ఒత్తిడి చేస్తుంటారు. ఫలితంగా కొత్తకోడలికి అత్తవారి బంధువులతో పెరగాల్సిన అనుబంధం తగ్గిపోతుంది. 'నాది' అనే భావం అత్తవారింట్లో ఏర్పడే అవకాశం సన్నగిల్లుతుంది. పుట్టింటికి చేరిన అమ్మాయి అత్తగారి చర్చలను, చేష్టలను విమర్శిస్తుంటే తల్లిదండ్రులు కూడా ఆమెకు వంత పాడతారు. అత్తగారిల్లు ఒక నరకం అనే అభిప్రాయం ఆమెలో నాటుకునేటట్లు చేస్తారు. ఫలితంగా అత్తాకోడళ్ల మధ్య సమరం మొదలవుతుంది. తెలివైన తల్లిదండ్రులు అత్తగారిని విమర్శించే కూతురి ధోరణిని సమర్ధించరు. అత్తగారింటి వాతావరణానికి సర్దుకోమని సలహా ఇస్తారు.
భర్తే ఆమెకు బహుమతి
కొత్త కోడలు ఒక విషయం దృష్టిలో ఉంచుకోవాలి. అత్తవారింటి నుండి తనకు లభించిన బహుమతి తన 'భర్త' అని. ఆ భర్తను పెంచి పెద్దచేసి సమర్థుడిగా తయారు చేయడంలో అత్తమామలు చేసిన త్యాగాలు, కష్టాలు, త్యజించిన సుఖాలు కొత్త కోడలు గుర్తుంచుకోవాలి. అత్తమామలు అంత శ్రమించి ఉండకపోతే తనకు అంత మంచి భర్త లభించి ఉండేవాడు కాదనే విషయం మరువకూడదు. ఈ రకమైన అభిప్రాయాలను చిన్న చిన్న పనులతో కోడలు అత్తవారింట ప్రదర్శిస్తూ తన స్థానాన్ని అభిమాన తెరల మధ్య పదిలంగా ఉండేటట్లు చేసుకోవాలి. తనంటే ఇష్టపడ్డారు కాబట్టే తనను కోడలిగా తెచ్చుకున్నారన్న విషయం మదిలో మెదులుతుండాలి. తాను ఆ కుటుంబానికి సరిపడననే ఆలోచనను మనసులోకి రానివ్వకూడదు. ఒకసారి అత్తవారింట్లోకి అడుగుపెట్టేసరికి ఆ కుటుంబ స్టేటస్‌ తనకు కూడా వచ్చేసిందని తెలుసుకోవాలి. ఈ విషయాలు రాయడం వెనుక ఒక కారణం ఉంది. అనేక సందర్భాల్లో కొత్త కోడలు అత్తవారింట తనను చిన్న చూపు చూస్తున్నారనే అపోహతో ఉండడమే కాదు, ఆ దృష్టితో ఉండడం వల్ల అత్తవారింట ఏ చిన్న విషయమైనా సరే తమ భావన నిజమని నిరూపించేందుకు ఆ విషయాలను తనకు అనుగుణంగా విశ్లేషించి చెబుతుంటారు. ఈ రకమైన ప్రవర్తన అత్తవారింటికి దూరం చేస్తుందని కొత్త కోడలు గ్రహించాలి.
పోలికలు వద్దు
సాధారణంగా కొత్త కోడలు తమ వదినలతో సరిపోల్చుకుంటారు. ముఖ్యంగా వదినా ఆడపడుచులు ఒకే వయసువారైతే ఈ పోల్చుకోవడం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ పోలిక క్రమక్రమంగా అసూయగా మారుతుంది. మొదట్లో వారి మధ్య నిశ్శబ్ద యుద్ధం మొదలై అది క్రమంగా సమరంగా తయారవుతుంది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టగానే కొన్ని చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. ఇది సహజం. కోడలు గర్భవతి అయిందంటే పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తాయి. మొత్తం మార్పిడికి ఇది దోహదపడుతుంది. తెలివైన కోడలు ఓర్పుగా ఉంటుంది. ఎగిసిన కెరటాలు అవే సర్దుకుంటాయి. ఆ విధంగా గాక ప్రతి చిన్న విషయానికి ఎదిరించి తన ఉనికి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే చినికి చినికి గాలివానగా మారి చివరకు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. చిన్న చిన్న తగాదాలకు కన్నీళ్లు పెట్టుకుంటే అవతలివారిలో శాడిజం పెంచిన వారవుతారు. మీ తప్పు లేదని మీ భావం ఏమిటో నిర్భయంగా, వినయంగా చెప్పాలి.


ఇతరుల మాటలు
కొత్త కోడలు తన ఠీవీని నిలబెట్టుకుంటూ ఇతరులు చెప్పే లేనిపోని మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు.
తనకు, అత్తగారికి, భర్తకు నడుమ మరొకరి ప్రమేయాన్ని అంగీకరించకూడదు.
తను, అత్తగారు, భర్త అంతా ఒకే యూనిట్‌ అని భావించాలి. వారి మధ్య అనుబంధం, ఆత్మీయత, అనురాగ బంధాలు ఏర్పడే విధంగా ప్రవర్తించాలి.
నలుగురు కలిసినప్పుడు ఒకరి పొరపాట్లను మరొకరు ఎత్తి చూపకూడదు. ఒకసారి అటువంటి ప్రవర్తన మొదలైతే చివరకు అది కుటుంబ విచ్ఛిత్తికి దారి తీస్తుంది.
ఒకసారి భార్యాభర్తల మధ్య అనుబంధం తెగిందంటే ఎవరూ ముందుకు వచ్చి దాన్ని మళ్లీ ఏర్పాటు చేయలేరు సరికదా ప్రతి ఒక్కరూ దూరం పెంచేందుకు తమకు తెలియకుండా కృషి చేస్తారు.
జరిగిన నిజం ఏదయినా వ్యక్తిగత విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో చర్చించకూడదు. ఇతరులు సమస్యలను జటిలం చేయడానికి ప్రయత్నిస్తారు. తప్ప సయోధ్యకు కృషి చేయరు. ఇది కూడా అప్రయత్నంగానే జరుగుతుంది.
కొంతమంది కోడళ్లు పనికిమాలిన విషయాలపై దృష్టిని కేంద్రీకరించి కోల్డువార్‌లో భాగస్వాములవుతారు.
ఉమ్మడి కుటుంబాల్లో (ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి) కొత్త కోడలితో ఏ రకమైన సంబంధంలేని బంధువులు వచ్చి పోతుంటారు. ఆ బంధువులు అప్రయత్నంగా కొత్త కోడల్ని అత్తవారి వద్ద లేదా కొత్త కోడలికి అత్తవారి గురించి లేనిపోని మాటలు చెబుతుంటారు. జాగ్రత్తగా వుండాలి.

GODS MIRACLE - BIRTH OF A CHILD - TIPS FOR PREGNANT WOMEN IN TELUGU



ప్రతి ఇంటా జరిగే ఈ అద్భుతాన్ని చూసి ఆనందించడమే తప్ప ఇందులో ఉండే రహస్యాలు ఎవరికీ అంతుచిక్కవు. జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసుకుని పొందే ఆనందాన్ని వర్ణించడం ఎవరితరం? స్త్రీ, పురుషుల కలయికలో అండం వీర్యకణాలతో సంయోగం చెంది పిండంగా తయారై శిశువుగా రూపొందడం సృష్టిలో ఒక అద్భుతం. తల్లి గర్భంలో ద్రవపదార్థాల్లో తేలుతూ ఏమీ తినకుండా శిశువు ఎదిగి తల్లి శరీరం నుండి బయటికి రావడం మనిషి మేథకు అందని ఒక అతీత ప్రకృతి చర్య. గర్భస్థ శిశువుకు ఎటువంటి దెబ్బలూ తగలకుండా, ఏ విధమైన ఉష్ణోగ్రతా మార్పులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదకరమైన సూక్ష్మజీవుల బారినపడకుండా కాపాడగల పరిరక్షణ తల్లి గర్భంలో సమకూడడం ఎంత చిత్రమైన విశేషం!
ప్రసవం
తల్లి గర్భం నుండి శిశువు బయటికి వచ్చేటప్పుడు దాని చలనాన్ని శిశువు తల అడ్డుకుంటుంది. శిశువు తల తల్లి శరీరం నుండి బయటికి వస్తే మిగిలిన ప్రసవం ఎంతో సులువు అవుతుంది. పుట్టే బిడ్డ కపాలంలో ఎన్నో ఎముకలు ఒకదానితో మరొకటి సంధానం కాబడి ఉంటాయి. ఇవన్నీ సులువుగా ఎటు కావాలంటే అటు కదిలే దారాలవంటి టేపు పదార్థంతో అతకబడి ఉంటాయి. విచిత్రం ఏంటంటే తల్లి గర్భం నుండి బయటికి వచ్చే బిడ్డ తలలోని ఎముకలు, తల కూడా ఇరుకు మార్గంనుండి బయటికి వచ్చేందుకు అనువుగా సర్దుకుంటాయి. ఫలితంగా శిశుజననానికి మార్గం సుగమం అవుతుంది. పుట్టిన బిడ్డ తల సాగదీసినట్లున్నా కొద్దిరోజుల్లో అది మామూలు ఆకృతికి రావడం ప్రకృతిలో కన్పించే ఒక మహాదృశ్యం. ఆ తర్వాత తల దృఢంగా మారుతుంది. తల్లిగర్భం నుండి బిడ్డ బయటికి రాగానే అంతవరకు బొడ్డుకు కలిసి ఉన్న బొడ్డు తాడు ప్లాసెంటా నుండి విడిపోతుంది. ఇక బిడ్డ తన ఆహారం తాను నోటి ద్వారా తీసుకోవడానికి అలవాటుపడుతుంది. తల్లిగర్భంలో ఉన్నప్పుడు తల్లినుండి బిడ్డకు... బిడ్డ నాభి ద్వారా ఆక్సిజన్‌ అందుతుంది. తల్లి రక్తం నుండే బిడ్డకు ఆక్సిజన్‌, పోషక పదార్థాలు ప్లాసెంటా ద్వారా బిడ్డ రక్తంలోకి వెళతాయి. బిడ్డ రక్తంలో తయారైన కార్బన్‌ డై ఆక్సైడ్‌, ఇతర మలిన పదార్థాలు ప్లాసెంటా ద్వారా తల్లి రక్తంలోకి రవాణా అవుతాయి. గర్భస్థ శిశువులో ఆక్సిజన్‌ మోసుకుపోయే ఎర్ర రక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే పుట్టిన బిడ్డ ఎర్రగా కన్పిస్తుంది. బిడ్డ జన్మించగానే ఊపిరితిత్తులు తెరుచుకుని పనిచేయనారంభించడం మానవ జీవితంలో కన్పించే తొలి అద్భుతం. ఉపయోగించని ఒక జత సంచుల్లాంటి ఊపిరితిత్తులు తెరుచుకుని పని చెయ్యడం, రక్తాన్ని గుండె ఆపుతూ, విడుదల చేయడం సృష్టిలో కన్పించే ఊహాతీతమైన మరొక అద్భుతం.
శిశువు విశేషాలు
పుట్టిన శిశువుకు ఆహారం అంటే ఏంటో తెలీదు. తల్లి పాల నుండి కూడా మొదటి నాలుగు రోజులు సరైన ఆహారం బిడ్డకు వెళ్లదు.
తల్లికి నెలలు నిండిన తర్వాత గర్భస్థ శిశువు అధికంగా ఆహారాన్ని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. ఒంట్లో నిల్వ వున్న ఆహారాన్ని మొదటి వారంలో వినియోగించుకుని శిశువు తిండి తినకపోయినా ఉండగల్గుతుంది. అందుకే బిడ్డ బరువు పుట్టిన వారం తర్వాత తగ్గుతుంది. శిశువు వయసు వారం దాటేసరికి ఆహారం తీసుకోవడం అలవాటవుతుంది. అంటే తల్లి పాలు తాగడం అలవాటవుతుంది. ఆనాటి నుండి బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. బిడ్డ పుట్టినప్పుడు నాడి కొట్టుకునే రేటు నిముషానికి 120 నుండి 160 వరకు ఉంటుంది. ఆవేశ స్థితిలో 180 వరకు కూడా ఉండొచ్చు. పసిబిడ్డలకు సహజ సిద్ధమైన రాడార్‌ వ్యవస్థ వంటి నిర్మాణం ఉంటుంది. ఎంత పసిబిడ్డయినా తిండికోసం వెతకడం, పాల వైపుకు అప్రయత్నంగా తిరగడం జరుగుతుంది. బుగ్గకు ఏం తగిలినా వెంటనే తల అటువైపుకి తిప్పి దాన్ని నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పుట్టిన బిడ్డకు తలమీద అదుపు ఉండదు. బిడ్డ కావలసిన దిశలో తల ఎత్తలేదు. గొప్ప తమాషా ఏంటంటే మంచంమీద బోర్లాపడి ముక్కు మంచానికి హత్తుకుని ఊపిరి ఆడని పరిస్థితి వస్తే బలమంతా పుంజుకుని తల ఒక వైపుకి తిప్పగల్గుతుంది. ఇదొక మహాద్భుతం.
పిల్లలు వికృతంగా ఎందుకు పుడతారు?
తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ట్రాంక్విలైజర్లు, థాలిడోమైడ్‌ వంటి మందులు ఉపయోగించడం వల్ల శిశువులు వికృతంగా పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లోపభూయిష్టమైన జననాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విజ్ఞానాన్ని టెరటాలజీ అంటారు. తల్లికి విటమిన్ల లోపం కలిగితే బిడ్డకు వికృత రూపం వస్తుందని ఒక వైద్యపరిశోధక బృందం అభిప్రాయపడింది. గర్భిణీగా ఉన్న సమయంలో మీథైల్‌ ఫాలికామ్లం వంటి యాంటీ మెటబాలిటీలు ఇవ్వడం వల్ల గర్భస్థ శిశువుకు అందే ఆహారం తగ్గిపోతుంది. అంతేగాక తల్లి గర్భిణీ సమయంలో అయిడో ఎసిటేటు, ఇన్సులిన్‌ వంటి వాటిని తీసుకున్నా పిల్లలు వికృత రూపంలో పుట్టే అవకాశం ఉంటుందంటున్నారు. గర్భవతి ఎక్కువగా పంచదార తినడం వల్ల పుట్టే బిడ్డ మెదడులో లోపం ఏర్పడే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని నమ్మకాలు
గ్రహణ సమయంలో స్త్రీ పురుషులు కలిస్తే వారికి వికృత రూపంలో పిల్లలు పుడతారని ఒక మూఢ నమ్మకం. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు సూర్య, చంద్రులను చూస్తే వారికి గ్రహణం, మొర్రితో పిల్లలు పుడతారనేది మరొక నమ్మకం. ఈ నమ్మకాలను సైన్సు సమర్ధించడం లేదు. మనిషి ఎంత పురాతన కాలం నుండి ఈ భూమి మీద నివసిస్తున్నాడో అంత పురాతన కాలం నుండి లోపభూయిష్టమైన జననాలు ఉన్నాయి. ప్రతి వెయ్యిమంది బిడ్డల జననంలో కనీసం పదిమందికి ఏదో ఒక లోపం ఉంటుంది. 

BLOOD PRESSURE - A DANGEROUS DISEASE - HOW TO CONTROL - TIPS IN TELUGU


హైపర్‌ టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు అనేక గుండె జబ్బులకు మూల సూత్రధారి. ఇది గుండెపోటు లేదా మూత్రపిండాల సమస్యలను తట్టి లేపుతుంది. రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? దానిని అదుపు చేయడం ఎలా? దీన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!
మనిషి శరీరంలో గుండె రక్తాన్ని వేరు వేరు అవయవాలకు ధమనులనే శుద్ధ రక్తనాళాల ద్వారా పంపు చేస్తుంది. గుండె పంపు చేయడం అంటే అది ముడుచుకుని, తెరుచుకుని పని చేస్తుంది. ఇలా గుండె పనిచేయడంలో రక్తం రక్తనాళాలలోకి గెంటపడుతుంది. ఈ నిరంతర ప్రక్రియ ఫలితంగా రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది.
ఇలా ప్రవహించే రక్తం రక్తనాళాలపై పీడనాన్ని కలుగజేస్తుంది. ఈ పీడనాన్నే రక్తపోటు అంటారు.

సిస్టోలిక్‌ - డయాస్టోలిక్‌
గుండె ముడుచుకున్నప్పుడు అందులోని రక్తం కొంత ఒత్తిడితో రక్తనాళాల్లోకి గెంటబడుతుంది. ఆ సమయంలో శుద్ధ రక్తనాళాలు (ధమనులు) ఎంత రక్తపోటుకి గురి అవుతాయో దాన్ని సిస్టోలిక్‌ రక్తపోటు అంటారు. ముడుచుకున్న గుండె తెరుచుకున్నప్పుడు మరల శుద్ధ రక్తనాళాల్లోకి కొంత ఒత్తిడితో రక్తం ప్రవహిస్తుంది. ఈ సమయంలో శుద్ధ రక్తనాళాలు ఎంత రక్త పోటుకు గురి అవుతాయో దాన్ని డయాస్టోలిక్‌ రక్తపోటు అంటారు. ఉండాల్సిన రక్తపోటు కన్నా అధికంగా రక్తపోటు ఉంటే దాన్ని హైపర్‌ టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు అంటారు. ఆరోగ్యవంతుడైన వయోజనుడికి ఉండాల్సిన సాధారణ రక్తపోటు 120-80 మాత్రమే.
రక్తపోటు తీరు!
ఏ మనిషికైనా రక్తపోటు స్థిరంగా ఒకేలా ఉండదు. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రక్తపోటును ప్రభావితం చేసే అంశాలు అదృశ్యం కాగానే రక్తపోటు ఆ వ్యక్తిలో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయికి వస్తుంది. వ్యాయామం, ఒత్తిడి, కోపం, చల్లని వాతావరణం వంటి అంశాలు రక్తపోటులో మార్పు తీసుకొస్తాయి. భయం, ఆందోళనలు కూడా రక్తపోటుపై ప్రభావం చూపుతాయి. మనిషి నిద్రించే సమయంలో మొత్తం శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది. శరీరం నుండి ద్రవపదార్థాలు అధికంగా నష్టపోయినప్పుడు, వాంతులు ఎక్కువగా అయినప్పుడు కూడా రక్తపోటు తగ్గుతుంది. కొంతమందికి అసలు ఎందుకు రక్తపోటు వస్తుంది? అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా వైద్య శాస్త్రానికి అందలేదు. మిగిలిన హెచ్చురక్తపోటు గలవారికి రక్తపోటు పెరగడానికి కారణాలు ఉంటాయి. ధమనుల గోడలు దళసరిగా తయారై రక్తం ప్రసరించే మార్గం సన్నబడుతుంది. అందుకే రక్తపోటు పెరుగుతుంది. కొంతమందిలో ఎడ్రినల్‌ గ్రంథిలో ట్యూమర్లు ఏర్పడడం, మూత్రపిండాల సమస్యలు, కొన్ని ఔషధాలు సేవించడం వల్ల, గర్భిణీ సమయంలో రక్తం విషపూరితం కావడం వల్ల అధిక రక్తపోటు వుస్తుంది.
ఎవరికి వస్తుంది?
హై బి.పి రావడానికి వారసత్వం ఒక కారణం. వయోజనుల్లో ఆడవారికన్నా మగవారికి ఈ అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయులకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానులు, ఒత్తిడితో నలిగేవారు అధిక రక్తపోటుతో ఉండే అవకాశాలు ఉంటాయి.
అదుపు చేద్దాం
* అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునే పద్ధతుల్లో అత్యంత ప్రతిభావంతమైంది శరీర బరువును తగ్గించుకోవడం.
* శరీర బరువు తగ్గితే మనిషి ప్రకాశవంతంగా కన్పించడమే కాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* తరచూ అధికంగా మద్యపానం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం వుంటుంది. అందువల్ల మద్యపానానికి స్వస్తి చెప్పడం మంచిది.
* వైద్యుని సలహామేర వ్యాయామాలు చేయాలి. వ్యాయామం శరీర కండరాలను, గుండె పనితీరును ఎంతో మెరుగుపరుస్తుంది.
* ఉప్పు అంటే సోడియం క్లోరైడ్‌. దీనికి శరీరంలో నీటిని నిలుపుదల చేయగల శక్తి ఉంటుంది. దీనివల్ల రక్తం ఘనపరిమాణం పెరుగుతుంది. ఘనపరిమాణం పెరిగిన రక్తాన్ని సన్నగా మార్గం తయారైన రక్తనాళాల గుండా గుండె పంపుచేసి పంపించాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.
* సాధారణంగా రోజుకి 10 గ్రాములు ఉప్పు తీసుకుంటాం. హైపర్‌ టెన్షన్‌ ఉన్నవారు దీన్ని 5గ్రాములకు తగ్గించాలి.
* కెఫీన్‌ రక్తపోటును పెంచుతుంది. కాఫీ, టీ, కోకో, చాక్లెట్‌, శీతలపానీయాలు, కొన్ని ఔషధాలలో కెఫీన్‌ ఉంటుంది. వీటి వాడకం వీలైనంత వరకు తగ్గించాలి.
* కాల్షియం రక్తపోటును అదుపులోకి తెస్తుంది. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, తృణధాన్యాలు, ఆకుకూరలు, సోయాబీన్స్‌, కొబ్బరికాయ వంటివాటిలో తగినంత కాల్షియం ఉంటుంది. అందుకే ఆహారంతో పాటు వీటిని కూడా తీసుకోవాలి.
* పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారపదార్థలు తినాలి.
ఔషధాలు
* ఆహార నియమాలు పాటించినా కొంతమంది ఔషధాలు ఉపయోగించాల్సి వస్తుంది. వైద్యుడు చెప్పిన విధంగా మందులు వాడాలి. మధ్యమధ్యన మరుపు పేరుతో మందు వేసుకోకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి. లీ డైయురెటిక్స్‌ ఔషధాలు రక్తంలోని అధిక నీటిని బయటికి పంపిస్తాయి. లీ బీటా బ్లాకర్స్‌ నరాలు కొట్టుకునే రేటును తగ్గించి గుండె పనిచేసే వేగాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును కిందికి తీసుకొస్తాయి. లీ ఆల్ఫా బ్లాకర్స్‌ రక్తనాళాలను విశాలం చేస్తాయి. లీ ఎసిఇ (యాంజియోటెన్షన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌) ఔషధం రక్తపోటును పెంచే హార్మోన్‌ చర్యను అరికడుతుంది. లీ కాల్షియం చానల్‌ బ్లాకర్లు రక్తనాళాలు విశాలం అయ్యేటట్లు చేస్తాయి. వీటివల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. అయినా వైద్యుడ్ని సంప్రదిస్తే మరొక ఔషధం ఇస్తాడు. సైడ్‌ ఎఫెక్ట్‌ ఉందని మందులు మానకూడదు.

BEWARE OF SUGAR ITEMS - LEADS TO DOWN TREND OF MEMORY

జ్ఞాపకశక్తిని తగ్గించే చక్కెర..!




అధికంగా స్వీట్లూ, కూల్‌డ్రింకులు తాగేవారికి హెచ్చరిక. అధిక ఫ్రక్టోజ్‌ ఉన్న ఆహారం తింటే కేవలం ఆరువారాలలో మెదడు పనితనం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తి గణనీయంగా తగ్గిపోతాయట. గతంలో అధిక ఫ్రక్టోజ్‌ వల్ల డయాబెటిస్‌, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిసిందే. కానీ, ఈ ప్రత్యేక చక్కెర పదార్థం మెదడు పనితనాన్నీ దెబ్బతీస్తుందని ఇప్పుడే తెలిసింది. సాఫ్ట్‌డ్రింకులు, స్వీట్లు, పసిపాపల ఆహారపదార్థాలలో కార్న్‌ సిరప్‌ అనే దాన్ని వాడతారు. అది మామూలు చెరుకు చక్కెర కన్నా ఆరు రెట్లు తీయదనం గలది. ఇవేకాక సహజంగా పండ్లలో కూడా ఫ్రక్టోజ్‌ ఉంటుంది. కానీ, అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ అతి తీపి పదార్థాల నుండి దూరంగా ఉండటం ఎన్నో విధాల శ్రేయస్కరం అని అంటున్నారు. మరిక తీపి అలవాట్లు కాస్తంత నియంత్రించుకోవల్సిందేనండోరు..!

LORD GANESH PRAYER

MY LOVE TELUGU POETRY

LORD SRI KRISHNA TELUGU POETRY

TELUGU POETRY

Tuesday 29 January 2013